కేజిఎఫ్…సలార్ సిరీస్ లతో పాన్ ఇండియా రేంజ్ లో భారీ క్రేజ్ ను సొంతం చేసుకుని ఏకంగా ఇండియా టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా మారిన ప్రశాంత్ నీల్(Prashanth Neel) అందించిన కథతో…కన్నడ లో మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న యాక్టర్స్ లో ఒకరైన శ్రీ మురళి(Sriimurali) హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ…
బఘీర(Bagheera Telugu Review) సినిమా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కగా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకుంది…ఇక సినిమా రివ్యూ విషయానికి వస్తే ముందుగా కథ పాయింట్ ఏంటంటే….చిన్నప్పటి నుండి తల్లి మాటలు విన్న హీరో ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి…
పోలిస్ అవుతాడు కానీ పోలిస్ అయినా కూడా తను అనుకున్నది ఏం సాధించలేక పోతాడు…ఇలాంటి టైంలో హీరో రూట్ అండ్ రూపం మార్చి బఘీరగా మారి శత్రువుల అంతు చూస్తాడు…ఈ క్రమంలో హీరో ఫేస్ చేసిన పరిస్థితులు ఏంటి ఆ తర్వాత కథ ఏమయింది అన్నది మిగిలిన కథ….
మొత్తం మీద ప్రశాంత్ నీల్ కథల్లో మరీ కొత్తదనం ఏమి ఉండదు కానీ యాక్షన్ సీన్స్ పరంగా టేకింగ్ పరంగా తన మార్క్ తో మెప్పిస్తాడు…బఘీర విషయానికి వస్తే మాత్రం యాక్షన్ సీన్స్ పరంగా మరోసారి తన మార్క్ కనిపించింది కానీ కథనం అండ్ టోటల్ కథ మాత్రం…
చాలా రొటీన్ గా అనిపించి చాలా వరకు కథ బోర్ ఫీల్ అయ్యేలా చేస్తుంది….యాక్షన్ పార్ట్ బాగున్నా మెయిన్ పాయింట్ ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వడం విషయంలో విఫలం అయ్యింది…. దాంతో చాలా పార్ట్ కథ మరీ ఫ్లాట్ గా మారిపోయింది…సంగీతం ఓకే అనిపించగా…
బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది…యాక్షన్ సీన్స్ కి సాలిడ్ గా అనిపించింది…మొత్తం మీద కథ పాయింట్ మరీ రొటీన్ అవ్వడంతో తర్వాత సీన్ ఏముతుంది అన్నది ఆడియన్స్ కి ఈజీగా తెలిసిపోవడం కూడా బోర్ ఫీల్ అయ్యేలా చేసింది. శ్రీ మురళి పెర్ఫార్మెన్స్ ఆకట్టుకోగా….
యాక్షన్ సీన్స్ కూడా అదరగొట్టాడు…హీరోయిన్ రుఖ్మిని రోల్ మరీ కొత్తదనం ఏమి లేదు…మిగిలిన యాక్టర్స్ పర్వాలేదు అనిపించగా….మాస్ మూవీస్ ఇష్టపడే ఆడియన్స్ యాక్షన్ సీన్స్ వరకు ఇష్టపడే ఆడియన్స్ కొంచం ఓపికతో చూస్తె ఓకే అనిపించవచ్చు కానీ…
ఇలాంటి యాక్షన్ మూవీస్, రొటీన్ మాస్ మూవీస్ మనం చూసి చూసి ఉన్నాం కానీ ఓవరాల్ గా కొత్తదనం కోరుకునే ఆడియన్స్ కి మాత్రం సినిమా అంతగా ఎఫెక్టివ్ గా ఏమి అనిపించదు…లో ఎక్స్ పెర్టేషన్స్ తో వెళితే కథ మరీ రొటీన్ గా అనిపించినా చాలా ఓపికతో చూస్తె పర్వాలేదు అనిపించవచ్చు… మొత్తం మీద సినిమాకి మా రేటింగ్ 2.25 స్టార్స్..