బాక్స్ ఆఫీస్ దగ్గర అఖండ(Akhanda) కన్నా ముందు వరుస ఫ్లాఫ్స్ తో కెరీర్ లోనే లోవేస్ట్ ఫేస్ లో ఉన్న నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) అఖండతో సాలిడ్ కంబ్యాక్ ను సొంతం చేసుకోగా ఈ ఇయర్ చేసిన వీర సింహా రెడ్డి(Veera Simha Reddy) సినిమాతో కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది.
మిక్సుడ్ రెస్పాన్స్ ఉన్నప్పటికీ సంక్రాంతి హాలిడేస్ ను ఎంజాయ్ చేసి బాలయ్య కెరీర్ లో రికార్డులు నమోదు చేస్తూ ఏకంగా 134 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా ఈ ఇయర్ ఇప్పుడు బాలయ్య నటించిన మరో సినిమా భగవంత్ కేసరి(Bhagavanth Kesari) దసరాకి రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి…
సొంతం చేసుకుని కలెక్షన్స్ పరంగా కొంచం స్టార్ట్ ను సొంతం చేసుకున్నా ఓవరాల్ గా ఇప్పుడు పాజిటివ్ టాక్ పవర్ ను చూపెడుతూ దూసుకు పోతూ ఉండగా సినిమా ఇప్పటి వరకు ఆల్ మోస్ట్ 86-88 కోట్ల మధ్యలో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకోగా… ఈ ఇయర్ బాలయ్య నటించిన సినిమాల టోటల్ గ్రాస్ లెక్క…
200 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసి ఇప్పుడు 220 కోట్ల మార్క్ గ్రాస్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టిస్తూ కెరీర్ లోనే బిగ్గెస్ట్ రికార్డ్ ను నమోదు చేయడం విశేషం. వీర సింహా రెడ్డి 134 కోట్లు భగవంత్ కేసరి ఇప్పటి వరకు 88 కోట్లు అందుకుని టోటల్ గా 2 సినిమాల కలెక్షన్స్ లెక్క ఇప్పుడు 222 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని దుమ్ము లేపగా…
సినిమా లాంగ్ రన్ లో మరింత జోరు చూపించి ఇలానే జోరు పెంచే అవకాశం ఎంతైనా ఉండగా టోటల్ గా కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ ని ఒక క్యాలెండర్ ఇయర్ లో అందుకున్న బాలయ్య అన్నీ అనుకున్నట్లు జరిగితే 250 కోట్ల మార్క్ ని ఈ ఇయర్ లో అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.