బాక్ టు బాక్ బాక్స్ ఆఫీస్ దగ్గర హాట్రిక్ విజయాలను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసిన నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్(Daaku Maharaaj Movie) సినిమాతో సంచలనం సృష్టిస్తూ ఓపెనింగ్స్ పరంగా సంక్రాంతికి కుమ్మేసినా కూడా లాంగ్ రన్ లో మాత్రం అనుకున్న రేంజ్ లో అంచనాలను తగ్గట్లు…
హోల్డ్ ని అయితే చూపించ లేక పోయింది….అయినా కూడా బాలయ్య కెరీర్ లో ఓవరాల్ గా హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాగా నిలిచింది. కాగా బాలయ్య నటించిన రీసెంట్ మూవీస్ రాయలసీమ ఏరియాలో సీనియర్స్ లో బెస్ట్ ట్రెండ్ ను చూపించి మాస్ రచ్చ చేయగా డాకు మహారాజ్ కొంచం…
అంచనాలను పూర్తిగా అందుకోలేక పోయినా కూడా ఓవరాల్ గా టోటల్ రన్ లో 12.65 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని పరుగును పూర్తి చేసుకోగా ఓవరాల్ గా బాలయ్య లాస్ట్ 4 సినిమాల రాయలసీమ షేర్ లెక్కలు ఆల్ మోస్ట్ 60 కోట్ల మార్క్ ని అందుకుని మాస్ రచ్చ చేయడం విశేషం అని చెప్పాలి..
బాలయ్య నటించిన అఖండ మూవీ ముందు వరుస ఫ్లాఫ్స్ తో సతమతం అయినా కూడా అఖండ తో ఇక్కడ 16.05 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని మాస్ రచ్చ చేయగా తర్వాత వీర సింహా రెడ్డి సినిమా టోటల్ రన్ లో 16.45 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకుని కుమ్మేయగా….తర్వాత చేసిన…
హాట్రిక్ మూవీ అయిన భగవంత్ కేసరి సినిమా టోటల్ రన్ లో 14.45 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని కుమ్మేసింది. ఇక ఇప్పుడు డాకు మహారాజ్ మూవీ టోటల్ రన్ లో 12.65 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకోగా టోటల్ గా 4 సినిమాల రాయాల సీమ ఏరియా టోటల్ షేర్ లెక్క ఇప్పుడు…
59.60 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకుని మాస్ ఊచకోత కోసింది…యావరేజ్ గా ఒక్కో సినిమా కి ఇప్పుడు బాలయ్య సినిమాకి రాయలసీమ లో 14.90 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటూ సీనియర్స్ లోనే కాదు టాప్ స్టార్స్ లో కూడా బెస్ట్ వన్ ఆఫ్ ఐ బెస్ట్ యావరేజ్ తో దూసుకు పోతూ ఉండటం విశేషం. ఇక అఖండ2 బాలయ్య ఏ రేంజ్ లో రచ్చ చేస్తాడో చూడాలి.