Home న్యూస్ 3 డిసాస్టర్స్ నుండి ఇప్పుడు నంబర్ 1…..బాలయ్య శివ తాండవం!!

3 డిసాస్టర్స్ నుండి ఇప్పుడు నంబర్ 1…..బాలయ్య శివ తాండవం!!

0

నట సింహం నందమూరి బాలకృష్ణ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ టైం లో వరుస పరాజయాల్లో ఉన్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ బయోపిక్ సిరీస్ కానీ తర్వాత చేసిన రూలర్ సినిమా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర తీవ్రంగా నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకోగా, ఇలాంటి టైం లో బాలయ్య బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కంబ్యాక్ ఇస్తాడా అని అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న టైం లో బరిలోకి దిగిన లేటెస్ట్ మూవీ అఖండ తో బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసి…

సంచలన కలెక్షన్స్ తో మొదటి రోజే ఊహకందని జోష్ ని చూపెట్టి దుమ్ము దుమారం చేశాడు. బాక్స్ ఆఫీస్ దగ్గర అఖండ సెన్సేషన్ ని చూసి ట్రేడ్ కూడా శాకయ్యే రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకున్న ఈ సినిమా ఫస్ట్ డే 15.39 కోట్ల షేర్ ని సాధించి బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనర్ గా…

నిలిచి సంచలనం సృష్టించగా రీసెంట్ టైం లో బాలయ్య కెరీర్ లో చేసిస సినిమాలలో ఇది బిగ్గెస్ట్ లీడ్ తో టాప్ లో నిలిచింది. ఇది వరకు రూలర్ సినిమా మొదటి రోజు 4.25 కోట్ల షేర్ ని అందుకోగా అంతకన్నా ముందు చేసిన ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా 2.12 కోట్ల షేర్ తో…

బాలయ్య కెరీర్ లో రీసెంట్ టైం లో లోవేస్ట్ ఓపెనింగ్స్ ని అందుకున్న సినిమాగా నిలిచింది. ఇక అంతకన్నా ముందు సంక్రాంతికి వచ్చిన ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా 7.6 కోట్ల షేర్ ని సొంతం చేసుకోగా, ఆ సినిమా కన్నా ముందు వచ్చిన జై సింహా సినిమా 6.75 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది, అంతకన్నా ముందు పైసా వసూల్ సినిమా 7.88 కోట్ల షేర్ ని సొంతం చేసుకోగా….

ఆ సినిమా కన్నా ముందు గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా 9.85 కోట్ల షేర్ తో కెరీర్ టాప్ లో నిలిచింది. ఆ సినిమాను ఇప్పుడు టికెట్ రేట్లు తక్కువగా ఉన్నా, బెనిఫిట్ షోలు పడక పోయినా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ ని అందుకుని కెరీర్ లో ఆల్ టైం బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తో దుమ్ము దుమారం చేశాడు బాలయ్య. ఇక లాంగ్ రన్ లో సినిమా ఇంకా ఎలాంటి రికార్డులు నమోదు చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here