Home న్యూస్ బాలకృష్ణ నర్తనశాల రివ్యూ…మినీ దృశ్యకావ్యం!!

బాలకృష్ణ నర్తనశాల రివ్యూ…మినీ దృశ్యకావ్యం!!

0

నట సింహం నందమూరి బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో మొదలైన సినిమా నర్తనశాల… 2004 లో భారీ హంగులతో మొదలైన ఈ సినిమా ప్రారంభం షూటింగ్ జరుపుకోగా అనుకోకుండా సౌందర్య గారి మరణం వలన సినిమా మధ్య లోనే ఆగిపోయింది. దాంతో సినిమా ను మొత్తానికే పక్కకు పెట్టిన బాలయ్య మళ్ళీ 16 ఏళ్ల తర్వాత ఇప్పుడు డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ చేయాలనీ డిసైడ్ అవ్వగా శ్రేయాస్ యాప్ లో పే పెర్ వ్యూ పద్దతిలో…

రీసెంట్ గా రిలీజ్ చేశారు. కేవలం 16 నిమిషాల లెంత్ మాత్రమే ఉన్న ఈ ఫూటేజ్ ఓ మినీ దృశ్యకావ్యం అనే చెప్పాలి. కథ పాయింట్ ఏంటి అంటే… 12 ఏళ్ల అరణ్యవాసం చేసిన పాండవులు మిగిలిన ఒక్క రోజు ను ఎలా ఎవ్వరికీ కనిపించకుండా పూర్తి చేయాలని చూడటమే ఈ సినిమా…

కానీ ఇందులో సౌందర్య గారి రెండు మూడు సీన్స్ ఆమె స్క్రీన్ ప్రజెన్స్ ని మరోసారి అద్బుతం అనిపించేలా చేయగా శ్రీహరి గారి డైలాగ్ హైలెట్స్ లో ఒకటిగా నిలిచింది. ఇక అర్జునుడిగా చేసిన బాలయ్య సింగిల్ టేక్ లో చెప్పే డైలాగ్ ముందు అనుకున్నట్లే హైలెట్ గా నిలిచింది.

ఇక వీటితో పాటు సీనియర్ ఎన్టీఆర్ గారు చేసిన నర్తనశాల సినిమాలోని కీలక గట్టాన్ని ఈ సినిమాలో వాడుకున్నారు. అది పెర్ఫెక్ట్ గా సింక్ అవ్వగా సినిమాకి కలిసి వచ్చింది, ఇక ఎండింగ్ లో బాలయ్య టాప్ హీరో మూవీ ఫ్యాన్స్ కి జోష్ ఇచ్చేలా వాడుకున్నాడు బాలయ్య… మొత్తం మీద ఈ 17 నిమిషాల లోపు ఉన్న…

మినీ దృశ్యకావ్యంలో సౌందర్య శ్రీహరి మన మధ్యన లేరు కాబట్టి వాళ్ళని మరోసారి గుర్తు చేసుకునేలా చేసింది, వారి రోల్స్ కి డబ్బింగ్ అంత బాగా సెట్ కాలేదు కానీ స్క్రీన్ ప్రజెన్స్ తో అవి మరిచిపోయేలా చేశారు. బాలయ్య డైరెక్షన్ చిన్న భాగమే అయినా బాగానే డైరెక్ట్ చేశాడు అనిపించింది.

ఓవరాల్ గా నర్తనశాల పేరుకు తగ్గట్లే బాగుంది అనిపించుకోవడం ఖాయమని చెప్పాలి. మధ్యలో ఆపేసిన ఈ సినిమాను బాలయ్య ఇప్పుడు మళ్ళీ మొదలు పెడితే అద్బుత దృశ్యకావ్యంగా నిలిచిపోవడం మాత్రం ఖాయమని చెప్పొచ్చు. 50 రూపాయలు ఖర్చు చేయడం మీకు పెద్ద కష్టం కాదు అనిపిస్తే… ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయోచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here