నట సింహం నందమూరి బాలకృష్ణ బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపి చాలా టైం అవుతుంది… 2019 ఇయర్ అయితే బిగ్గెస్ట్ డిసాస్టర్స్ తో ముగిసింది. 2020 ఇయర్ కరోనా తోనే సరిపోతుంది. ఇయర్ ఎండ్ కి పరిస్థితులు సద్దుకుంటే సంక్రాంతి బరిలో బోయపాటి డైరెక్షన్ లో చేస్తున్న సినిమా తో దుమ్ము లేపే కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు బాలయ్య. ఇక బోయపాటి తో చేసిన తర్వాత సినిమా ఎవరి తో అన్నది మాత్రం…
ఆసక్తిగా మారగా… రేసులో ముఖ్యంగా ఇద్దరు డైరెక్టర్స్ ఉన్నారని తెలుస్తుంది…. ఒకరు యంగ్ స్టార్ డైరెక్టర్ కాగా మరొకరు బాలయ్య తో ఇండస్ట్రీ హిట్లు కొట్టిన డైరక్టర్…. వీరిద్దరూ కూడా బాలయ్య కి కథలను వినిపించగా ఎవరితో బాలయ్య సినిమా చేస్తారు అన్నది ఆసక్తిగా మారింది.
టాలీవుడ్ లో పటాస్ సినిమా తో ఎంట్రీ ఇచ్చిన అనిల్ రావిపూడి ఇప్పటి వరకు అపజయం లేకుండా ఒకటికి మించి ఒకటి సూపర్ హిట్లు కొడుతూ దూసుకుపోతుండగా సరిలేరు నీకెవ్వరు బ్లాక్ బస్టర్ తర్వాత అప్ కమింగ్ మూవీ కమిట్ అవ్వాల్సి ఉండగా ఎఫ్ 3 అనుకున్నా కుదరలేదు… బాలయ్య కి కూడా కథ చెప్పాడు అనిల్…
ఇక బాలయ్యతో సమరసింహా రెడ్డి, నరసింహా నాయుడు లాంటి సెన్సేషనల్ ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన డైరెక్టర్ బి గోపాల్ కూడా ఎప్పటి నుండో బాలయ్య తో సినిమా కోసం ఎదురు చూస్తుండగా కచ్చితంగా తన అప్ కమింగ్ మూవీస్ లో ఒకటి కన్ఫాం గా ఇస్తానని బాలయ్య చెప్పారని టాలీవుడ్ లో టాక్ గట్టిగా వినిపిస్తుంది.
దాంతో బోయపాటి తో చేస్తున్న సినిమా తర్వాత ఎవరితో బాలయ్య సినిమా చేస్తాడు అన్నది ఆసక్తిగా మారగా అనిల్ రావిపూడి తో అయితే మినిమమ్ గ్యారెంటీ మూవీ కన్ఫాం అని చెప్పాలి. ఇక బి గోపాల్ మాస్ డైరెక్టర్ అయినా కానీ ఫాం కోల్పోయి చాలా కాలం అయింది. మరి బాలయ్య ఎవరితో తన అప్ కమింగ్ మూవీ చేస్తాడో చూడాలి మరి…