టాలీవుడ్ లో ఒకప్పుడు టాప్ డైరెక్టర్ గా దూసుకు పోయిన వివి వినాయక్ తర్వాత ఫాం కోల్పోయి సినిమాలు చాలా తక్కువగా చేస్తున్నారు. 2014 కి ముందు వరకు రాజమౌళి తర్వాత టాప్ 2 గా నిలిచిన వినాయక్ తర్వాత అల్లుడు శీను, అఖిల్ సినిమాలతో సక్సెస్ లను అందుకొక పోవడం తో రేసు లో సడెన్ గా డౌన్ అయిన టైం లో ఖైదీ నంబర్ 150 తో దుమ్ము లేపినా ఆ క్రెడిట్ చిరుకే వెళ్ళింది.
తర్వాత చేసిన ఇంటెలిజెంట్ అట్టర్ డిసాస్టర్ రిజల్ట్ ని సొంతం చేసుకోగా అప్పటి నుండి కొత్త సినిమాను మొదలు పెట్టని వినాయక్ రీసెంట్ గా మరో సారి మెగాస్టార్ తో లూసిఫర్ రీమేక్ ని డైరెక్ట్ చేసే అవకాశాన్ని దక్కించుకోగా ఈ సినిమా స్క్రిప్ట్ మార్పులు….
అన్నీ కూడా కంప్లీట్ అవ్వగా సినిమా ఇప్పట్లో మొదలు అయ్యే అవకాశం లేదని చెప్పాలి… చిరు ముందు 60% బాలెన్స్ ఉన్న ఆచార్య చేసిన తర్వాత వేదాలం రీమేక్ చేశాక ఈ సినిమాను మొదలు పెట్టొచ్చు అంటున్నారు. ఈ గ్యాప్ లో వినాయక్ ఇప్పుడు మరో సీనియర్ హీరో నట సింహం బాలయ్య తో…
మాస్ మూవీ చేసే పనిలో ఉన్నాడు అని లేటెస్ట్ టాలీవుడ్ టాక్. ప్రస్తుతం బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తున్న బాలయ్య ఈ సినిమాను త్వరలో మొదలు పెట్టి వచ్చే సమ్మర్ కి రిలీజ్ చేసే పనిలో ఉండగా తర్వాత సినిమా ఇప్పటి వరకు కమిట్ అవ్వని బాలయ్య వినాయక్ చెప్పిన కథ నచ్చడం తో కొన్ని మార్పులు చెప్పాడని ఇప్పుడు…
ఆ పనుల్లో వినాయక్ ఉన్నాడని, ఇయర్ ఎండ్ వరకు కథ ఫైనల్ నరేషన్ ఉంటుందని అంటున్నారు, వీళ్ళ కాంబినేషన్ లో ఇది వరకు వచ్చిన చెన్నకేశవ రెడ్డి కమర్షియల్ గా అంచనాలను అందుకోక పోయినా ఫ్యాన్స్ కి బాగా నచ్చిన బాలయ్య సినిమాల్లో ఒకటిగా నిలిచింది, మళ్ళీ ఇన్నేళ్ళకి వినాయక్ తో సెట్ అయితే ఫ్యాన్స్ కి పండగే అని చెప్పాలి…