కింగ్ నాగార్జున యువ సామ్రాట్ నాగ చైతన్య ల కాంబినేషన్ లో సోగ్గాడే చిన్నినాయన సినిమా సీక్వెల్ గా కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో రూపొందిన లేటెస్ట్ మూవీ బంగార్రాజు మంచి అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు ఇప్పుడు సంక్రాంతి కానుకగా 14 న గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా పై ఆడియన్స్ లో మంచి క్యూరియాసిటీ అయితే ఉందని చెప్పాలి… సంక్రాంతి సీజన్ లో ఉన్న సినిమాలలో…
బెటర్ ఆప్షన్ గా ఇప్పుడు కనిపిస్తున్న సినిమా ఇదే కాబట్టి కచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఏమాత్రం టాక్ పాజిటివ్ గా ఉన్నా కానీ థియేటర్స్ కి క్యూ కట్టడం ఖాయమని చెప్పోచ్చు. ఇక రీసెంట్ గా సినిమా సెన్సార్ పనులను పూర్తీ చేసుకుని U/A సర్టిఫికేట్ ను…
సొంతం చేసుకోగా ఓవరాల్ గా రన్ టైం 2 గంటల 40 నిమిషాల లెంత్ తో రాబోతుంది. ఇక సినిమా కి అక్కడ నుండి ఫస్ట్ టాక్ కూడా బయటికి వచ్చింది అని చెప్పాలి…. ఆ టాక్ ప్రకారం సినిమా పక్కా హిట్ మెటీరియల్ లా అనిపిస్తుంది… కథ పాయింట్ ని పూర్తిగా రివీల్ చేయలేదు కానీ….
లాస్ట్ టైం తన కొడుకుకు ఆపద ఉందని తెలిసి భూమి మీదకి వచ్చే బంగార్రాజు ఈ సారి తన మనవడి కోసం భూమి మీదకు వస్తాడు, ఇక్కడ మనవడు ఎలా ఉంటున్నాడు లాంటివి తెలుసుకున్న బంగార్రాజు ఏం చేశాడు, ఎలా భూమి మీదకి వచ్చిన బంగార్రాజు పిల్ల బంగార్రాజుని ఎలా మార్చాడు….అలాగే…
తనకి ఉన్న ఆపద ఏంటి అనేది సినిమా మెయిన్ కథగా చెబుతున్నారు, ఫస్టాఫ్ మొత్తం ఎంటర్ టైన్ మెంట్ తో సాగి సెకెండ్ ఆఫ్ కొంచం మెలో డ్రామా ఉన్నప్పటికీ సోగ్గాడే సినిమాకి ఏమాత్రం తీసిపోని విధంగా ఈ బంగార్రాజు ఉంటుంది అన్నది మాత్రం ఖాయమని అంటున్నారు. ఓవరాల్ గా సెన్సార్ వాళ్ళ నుండి సినిమాకి హిట్ రేంజ్ రిపోర్ట్స్ వినిపిస్తున్నాయి. ఇదే రేంజ్ రిపోర్ట్ లు ఇక్కడ రిలీజ్ అయ్యాక వినిపిస్తే ఇక రచ్చ ఖాయమని చెప్పొచ్చు.