Home న్యూస్ బంగార్రాజు – 400…రౌడీ బాయ్స్ – 300….ఎవ్వరూ తగ్గడం లేదుగా!

బంగార్రాజు – 400…రౌడీ బాయ్స్ – 300….ఎవ్వరూ తగ్గడం లేదుగా!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి రేసులో నిలిచిన సినిమాలు బంగార్రాజు రౌడీ బాయ్స్ మరియు హీరో సినిమాలు. వీటిలో హీరో సినిమా మాత్రం చాలా లిమిటెడ్ గా రిలీజ్ అవ్వగా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా మిగిలిన 2 సినిమాలతో పోల్చితే కలెక్షన్స్ కూడా తక్కువ గానే సొంతం చేసుకుంది. ఇక బంగార్రాజు బాక్స్ ఆఫీస్ దగ్గర పండగ సెలవుల్లో ఫుల్ డామినేషన్ ని చూపెడుతూ దుమ్ము లేపింది కానీ తర్వాత…

స్లో డౌన్ అవ్వక తప్పలేదు… ఇక రౌడీ బాయ్స్ కి టాక్ అంతంతే వచ్చినా యూత్ ఆడియన్స్ పర్వాలేదు అనిపించేలా థియేటర్స్ కి రావడం తో కలెక్షన్స్ డీసెంట్ గానే వచ్చాయి. దానికి తోడూ దిల్ రాజు ఈ సినిమా కోసం బెస్ట్ థియేటర్స్ ని కేటాయించడంతో అక్కడ నుండి…

కలెక్షన్స్ స్టడీగా సొంతం చేసుకుంది ఈ సినిమా… మొత్తం మీద ఇప్పుడు ఈ రెండు సినిమాలు రెండు వారాలను పూర్తీ చేసుకుని మూడో వారంలో ఎంటర్ అవ్వగా ఓవరాల్ గా హోల్డ్ చేసిన థియేటర్స్ కౌంట్ కూడా సాలిడ్ గానే ఉండటం విశేషమని చెప్పాలి. ముందుగా బంగార్రాజు సినిమా…

రిలీజ్ అయినప్పుడు 700 థియేటర్స్ లో మొదటి వారాన్ని కొనసాగించగా రెండో వారంలో 635 థియేటర్స్ లో రన్ అవ్వగా ఇప్పుడు మూడో వారంలో 400 వరకు థియేటర్స్ లో పరుగును కొనసాగిస్తుంది. ఇక ఈ సినిమా తో పోల్చితే చిన్న సినిమానే అయినా రౌడీ బాయ్స్ మాత్రం దిల్ రాజు నిర్మాత అవ్వడంతో సాలిడ్ గా థియేటర్స్ ని హోల్డ్ చేసింది. మొదటి వారంలో 400 థియేటర్స్ లో ఉన్న…

ఈ సినిమా రెండో వారంలో 325 థియేటర్స్ లో పరుగును కొనసాగించగా మూడో వారంలో కేవలం 25 థియేటర్స్ మాత్రమే కోల్పోయి 300 థియేటర్స్ లో రన్ అవుతుంది… ఈ రెండు సినిమాలే సగానికి పైగా థియేటర్స్ ని ఇప్పుడు హోల్డ్ చేసి పరుగును కొనసాగిస్తున్నాయి. మరి కలెక్షన్స్ పరంగా ఈ వారంలో ఈ సినిమాలు ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here