సంక్రాంతి పండగ టైం లో సినిమా రిలీజ్ అంటే బాక్స్ ఆఫీస్ షేక్ అయ్యి తీరాల్సిందే… ఆంధ్ర సీడెడ్ నైజాం అని తేడా లేకుండా అన్ని సెంటర్స్ లో కూడా అల్టిమేట్ కలెక్షన్స్ అన్ని సినిమాలను సొంతం అవుతూ ఉంటాయి. ఇప్పటి వరకు రిలీజ్ అయిన అన్ని సినిమాల్లో మంచి టాక్ ని సొంతం చేసుకున్న సినిమాలు అన్ని ఏరియాలలో కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపినవే…
కానీ ఈ సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాల్లో ఒకే ఒక్క పెద్ద సినిమా బంగార్రాజు బాక్స్ ఆఫీస్ దగ్గర మరీ అద్బుతం కాదు కానీ డీసెంట్ టాక్ నే సొంతం చేసుకోవడంతో ఇక కలెక్షన్స్ పరంగా కుమ్మేయడం ఖాయమని అంతా అనుకున్నారు… అందరూ అనుకున్నట్లే…
సినిమా మొదటి వీకెండ్ లో నాలుగో రోజు పార్షిక హాలిడే లో కూడా మంచి వసూళ్ళని సొంతం చేసుకున్నా కానీ వర్కింగ్ డేస్ లో చేతులు ఎత్తేసింది.. 3rd వేవ్ ఒక కారణం అయితే నైజాంలో సినిమా అండర్ పెర్ఫార్మెన్స్ మరో కారణం అని చెప్పాలి. కోస్టల్ ఆంధ్ర మరియు సీడెడ్ ఏరియాలలో…
బంగార్రాజు బాగా పెర్ఫార్మ్ చేస్తున్నా కానీ నైజాంలో అండర్ పెర్ఫార్మెన్స్ ఎక్కువగా చేస్తూ వస్తుంది…6 వ రోజు సినిమా ఇక్కడ 11 లక్షల షేర్ నే సొంతం చేసుకుంటే 7 వ రోజు కలెక్షన్స్ మరీ 6 లక్షలకి అటూ ఇటూగా ఉండటం ఏ రేంజ్ లో దెబ్బ తీసిందో అర్ధం చేసుకోవచ్చు. ఇక్కడ బిజినెస్ వాల్యూ ఆల్ మోస్ట్ 11 కోట్ల రేంజ్ లో ఉండగా మొదటి వారంలో కలెక్షన్స్ రికవరీ…
7.6 కోట్లకు పైగా ఉండగా బ్రేక్ ఈవెన్ కోసం సినిమా ఇంకా 3.4 కోట్లు ఇక్కడ వసూల్ చేయాల్సి ఉంది…..సినిమా సెకెండ్ వీకెండ్ లో కోలుకోక పొతే నైజాంలో ఏరియాలో గట్టి దెబ్బ తగలడం ఖాయమని చెప్పొచ్చు…మరి బంగార్రాజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వారంలో ఇక్కడ ఎలాంటి గ్రోత్ ని చూపెట్టి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.