బాక్స్ ఆఫీస్ దగ్గర నాగార్జున నాగ చైతన్యల కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ బంగార్రాజు భారీ లెవల్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉంది, సినిమా పై ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉండగా సంక్రాంతి రేసులో ఉన్న సినిమాల్లో నోటబుల్ అండ్ క్రేజీ మూవీ ఇదే అవ్వడం తో ఎక్స్ లెంట్ బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు గ్రాండ్ గా…
రిలీజ్ ను సొంతం చేసుకోవడానికి సిద్ధం అవుతుంది అని చెప్పాలి. మొత్తం మీద 38.15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 39 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ఇప్పుడు బాక్స్ ఆఫీస్ బరిలో దిగబోతుండగా రెండు తెలుగు రాష్ట్రాలలో…
ఇప్పుడు భారీ లెవల్ లోనే రిలీజ్ అవుతున్నా కానీ నైజాంలో మరీ గ్రాండ్ రిలీజ్ ను అయితే సొంతం చేసుకోవడం లేదు, ఒకసారి టోటల్ థియేటర్స్ కౌంట్ ని గమనిస్తే…
👉Nizam – 211
👉Ceeded – 130+
👉Andhra – 335+
AP TG:- 675+
👉KA+ROI: 100+
👉OS: 380+
WW: 1155+
ఇదీ మొత్తం మీద సినిమా టోటల్ థియేటర్స్ కౌంట్ లెక్క…
ఇక సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ రెండు మూడు రోజుల ముందుగానే స్టార్ట్ అయినా కానీ అన్ని చోట్లా బుకింగ్స్ రిలీజ్ కి ముందు రోజు మాత్రమే ఓపెన్ అయ్యాయి. కానీ కొన్ని చోట్ల బుకింగ్స్ డీసెంట్ గా ఉండగా కొన్ని చోట్లా ఇంకా జోరు చూపెట్టాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద సినిమా రిలీజ్ రోజున ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ఎక్కువ జరిగే అవకాశం ఉంది…
ప్రజెంట్ ట్రెండ్ ను చూస్తుంటే సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 4 కోట్ల నుండి 5 కోట్ల రేంజ్ లో ఓపెన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది, ఇక అన్ని చోట్లా పండగ అడ్వాంటేజ్ ను యూస్ చేసుకుని ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కూడా అంచనాలు మించితే కలెక్షన్స్ 6-7 కోట్ల రేంజ్ కి పెరిగే అవకాశం ఎంతైనా ఉంటుంది….. మరి సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.