Home న్యూస్ 1st మూవీ…సాలిడ్ బిజినెస్…రౌడీ బాయ్స్ క్లీన్ హిట్ కి ఎంత కొట్టాలంటే!!

1st మూవీ…సాలిడ్ బిజినెస్…రౌడీ బాయ్స్ క్లీన్ హిట్ కి ఎంత కొట్టాలంటే!!

0

ఆడియన్స్ ముందుకు ఈ శుక్రవారం సంక్రాంతి పండగ టైం లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఒకపక్క బంగార్రాజు సినిమా భారీ లెవల్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా మరో పక్క ఇదే రోజున దిల్ రాజు తమ్ముడి కొడుకు ఆశిష్ ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కిన లేటెస్ట్ మూవీ రౌడీ బాయ్స్ కూడా ఆడియన్స్ ముందుకు భారీగానే రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉందని చెప్పాలి.

దిల్ రాజు తమ్ముడి కొడుకు సినిమా అవ్వడంతో లాంచ్ విషయంలో భారీగా ప్రమోషన్స్ ని చేస్తూ బిగ్ స్టార్స్ తో సినిమాను ప్రమోట్ చేయిస్తూ సినిమా పై ఆడియన్స్ లో బజ్ క్రియేట్ చేయడానికి టీం చాలా కష్టపడుతున్నారు కానీ బజ్ అయితే మరీ అంతలా క్రియేట్ అవ్వలేదు.

ఇక సినిమా ఎక్కువ శాతం మౌత్ టాక్ పైనే డిపెండ్ అయ్యి ఆడియన్స్ ముందుకు రాబోతుండగా సినిమా టోటల్ బిజినెస్ లెక్క ట్రేడ్ లో చక్కర్లు కొడుతుంది. కాగా సినిమా ను కొన్ని మెయిన్ ఏరియాలలో దిల్ రాజు చాలా గ్రాండ్ గా ఓన్ గా రిలీజ్ చేయబోతూ ఉండగా… ఓవరాల్ గా సినిమా ఆంధ్ర రీజన్ మొత్తం మీద…..

4.5 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకుందట, ఇక సీడెడ్ ఏరియాలో 1.8 కోట్ల బిజినెస్ ను, నైజాంలో ఓన్ రిలీజ్ అయినా ఆ బిజినెస్ వాల్యూ 4 కోట్ల దాకా ఉంటుందని అంటున్నారు ట్రేడ్ వర్గాలలో… దాంతో ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా 10.3 కోట్ల బిజినెస్ ను అందుకోగా వరల్డ్ వైడ్ బిజినెస్ లెక్క 11 కోట్ల దాకా…ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆ లెక్కన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు వరల్డ్ గా హిట్ అవ్వాలి అంటే…..

మినిమమ్ 11.5 కోట్ల దాకా షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాలి. ఇవి ట్రేడ్ లెక్కలు కాగా అఫీషియల్ కన్ఫామేషన్ ఏమి ఇంకా రాలేదు, ఒకవేళ ఏమైనా మార్పులు లాంటివి ఉంటే కలెక్షన్స్ ఆర్టికల్స్ లో మరోసారి బిజినెస్ ను అప్ డేట్ చేస్తాం. ఓవరాల్ గా ఉప్పెనలా సెన్సేషనల్ ఆడియో ఏమి లేకున్నా డెబ్యూ హీరో మూవీ కి ఇది ఇప్పుడు సాలిడ్ బిజినెస్ అనే చెప్పాలి… ఇక బాక్స్ ఆఫీస్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here