బాక్స్ ఆఫీస్ దగ్గర సరిగ్గా 9 ఏళ్ల క్రితం ఊహకందని అంచనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఎస్ ఎస్ రాజమౌళి(SS Rajamouli) ఎపిక్ వండర్ మూవీ బాహుబలి(Baahubali The Beginning) రిలీజ్ అయిన మొదటి రోజే మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకుంది… రాజమౌళి సినిమాల్లో ఫస్ట్ టైం…
నెగటివ్ టాక్ ను సొంతం చేసుకున్న సినిమా మునుపటి ఇండస్ట్రీ రికార్డ్ మూవీస్ ని ఇక అందుకోవడం కష్టమే అనుకున్నారు అందరూ, సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్ సినిమా పోయిందని సంబరపడ్డారు. కానీ వీకెండ్ కే టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన సినిమా…
లాంగ్ రన్ లో అన్ని చోట్లా ఎపిక్ కలెక్షన్స్ తో సంచలనాలు సృష్టించింది… సినిమా ఓపెనింగ్ డే రోజున తెలుగు రాష్ట్రాల్లో 22.4 కోట్ల షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 46 కోట్ల షేర్ ని, 73 కోట్ల గ్రాస్ తో సంచలనం సృష్టించగా లాంగ్ రన్ లో సినిమా…..
నైజాంలో 43 కోట్ల షేర్ ని, సీడెడ్ లో 21.8 కోట్ల షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో…. 114 కోట్ల షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా తెలుగు వర్షన్ 194 కోట్ల షేర్ ని, అన్ని వర్షన్ లు కలిపి వరల్డ్ వైడ్ గా 304 కోట్ల షేర్ ని, 605 కోట్ల రేంజ్ లో ఎపిక్ గ్రాస్ ను అందుకుంది.
టోటల్ గా సినిమా 118 కోట్ల బిజినెస్ మీద టోటల్ రన్ లో అక్షరాలా 186 కోట్ల రేంజ్ ఎపిక్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది. అనేక రికార్డులు నమోదు చేసిన ఈ సినిమా అప్పటికి ఇండియన్ హిస్టరీలో ఆల్ టైం హైయెస్ట్ ప్రాఫిట్స్ ను అందుకున్న సినిమాగా నిలిచింది. అలాంటి సినిమా రిలీజ్ అయ్యి 9 ఏళ్ళు పూర్తీ అవ్వడం విశేషం…
ఇండియన్ సినిమాలకు పాన్ ఇండియా రేంజ్ మార్కెట్ ఏ లెవల్ లో ఉంది అన్నది గుర్తు చేసిన సినిమా బాహుబలి…ఆ మార్గంలో బాహుబలి2 ఎవ్వరికీ ఆనందంత ఎత్తులో రికార్డులు క్రియేట్ చేయడానికి బాహుబలి1 చాలా ముఖ్య పాత్ర పోషించింది అని చెప్పాలి…