Home న్యూస్ రాంపెజ్ స్టార్ట్ అయింది….11 కోట్లు ఔట్ అక్కడ…డే 1 కుమ్మేలా ఉందిగా!!

రాంపెజ్ స్టార్ట్ అయింది….11 కోట్లు ఔట్ అక్కడ…డే 1 కుమ్మేలా ఉందిగా!!

0

ఇండియన్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన శంకర్(Director Shankar) మరియు విక్రం లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత కమల్ హాసన్(Kamal Haasan) ల కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ భారతీయుడు (Bharateeyudu Movie) సినిమాకి సీక్వెల్ గా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వస్తున్న లేటెస్ట్ మూవీ భారతీయుడు2(Bharateeyudu2 Movie) సినిమా…

ఈ శుక్రవారం భారీ లెవల్ లో రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కి సిద్ధం అవుతుంది. కానీ సినిమా ట్రైలర్ అనుకున్న రేంజ్ లో ఆడియన్స్ ను అలరించలేదు. కానీ శంకర్ మూవీ అవ్వడంతో ఆడియన్స్ లో నమ్మకం ఇప్పటికీ ఉండటంతో సినిమా చూడటానికి…

భారీ లెవల్ లో ప్రీ బుకింగ్స్ జరుగుతూ ఉండటం విశేషం అని చెప్పాలి…సినిమా ఓవర్సీస్ లో ఇప్పటి వరకు జరిగిన ప్రీ బుకింగ్స్ ఎక్స్ లెంట్ గా ఉండగా ఓవర్సీస్ లోనే ఆల్ మోస్ట్ 7.3 కోట్ల రేంజ్ లో ప్రీ బుకింగ్స్ ను సొంతం చేసుకుని భారతీయుడు2 మూవీ మాస్ రాంపెజ్ ను స్టార్ట్ చేసింది ఇప్పుడు.

   

ఇక తమిళనాడు సినిమా బుకింగ్స్ రీసెంట్ గా ఓపెన్ అవ్వగా అక్కడ మాత్రం బుకింగ్స్ ఆశించిన స్పీడ్ తో అయితే స్టార్ట్ అవ్వలేదు….అక్కడ సూపర్ ఫాస్ట్ తో బుకింగ్స్ జోరు చూపుతుంది అనుకున్నా ఓవరాల్ గా 2.90 కోట్ల రేంజ్ లోనే బుకింగ్స్ జరగగా రెస్ట్ ఆఫ్ ఇండియాలో…

లిమిటెడ్ గా బుకింగ్స్ ఓపెన్ అవ్వగా ఓవరాల్ గా 80 లక్షల రేంజ్ లో బుకింగ్స్ జరిగాయి…కానీ ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పటి వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ లెక్కలతో 11 కోట్ల ప్రీ బుకింగ్స్ గ్రాస్ మార్క్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా మొదటి రోజు సినిమా కుమ్మేయడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా…

ఇండియాలో సినిమా కి ఇప్పుడు పాజిటివ్ టాక్ చాలా అవసరం అని చెప్పాలి…టాక్ పాజిటివ్ గా ఉంటే ఇక్కడ కూడా సినిమా రచ్చ చేసే అవకాశం ఉంటుంది. మొత్తం మీద వరల్డ్ వైడ్ గా భారతీయుడు2 మూవీ సాలిడ్ ఓపెనింగ్స్ ను ఇప్పుడు సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here