బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు కలెక్షన్స్ పరంగా ఆర్ ఆర్ ఆర్ మూవీ ఆల్ టైం రికార్డులతో దుమ్ము దుమారం లేపింది, ప్రీవియస్ రికార్డులను అన్నింటినీ వరల్డ్ వైడ్ గా బ్రేక్ చేసి సరికొత్త రికార్డులను నమోదు చేసింది, కానీ రెండో రోజు ఓవరాల్ కలెక్షన్స్ పరంగా మాత్రం బాహుబలి 2 కన్నా కూడా వెనుక బడే ఉంది అని చెప్పాలి. ఇక్కడ రెండో రోజు ట్విస్ట్ ఏంటి అంటే…
ఆర్ ఆర్ ఆర్ మూవీ తెలుగు రాష్ట్రాలలో బాహుబలి2 ని ఓ రేంజ్ లీడ్ తో దాటేసి దుమ్ము లేపినా హిందీ, రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో బాహుబలి 2 రెండో రోజు కలెక్షన్స్ ఆ టైం లో ఉన్న టికెట్ రేట్స్ తో కూడా సంచలనం సృష్టించి ఊచకోత కోశాయి…
హిందీ లో బాహుబలి 2 40.50 కోట్లు వసూల్ చేస్తే, ఆర్ ఆర్ ఆర్ 23.75 కోట్లు నెట్ కలెక్షన్స్ ని వసూల్ చేసింది, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం బాహుబలి 2 14.80 కోట్లు వసూల్ చేస్తే ఆర్ ఆర్ ఆర్ 31.63 కోట్లు వసూల్ చేసి సెన్సేషనల్ లీడ్ ను సొంతం చేసుకుంది…. మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర…
వరల్డ్ వైడ్ గా రెండో రోజు బాహుబలి 2 మూవీ 73.20 కోట్ల షేర్ ని రెండో రోజు టోటల్ గా సొంతం చేసుకుంది, ఇక గ్రాస్ కలెక్షన్స్ లెక్కలు 143 కోట్ల రేంజ్ లో ఉండగా, ఆర్ ఆర్ ఆర్ మూవీ రెండో రోజు మొత్తం మీద వరల్డ్ వైడ్ గా 67.44 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది… గ్రాస్ కలెక్షన్స్ లెక్క 121 కోట్ల దాకా ఉంది…
2 సినిమాల మధ్య షేర్ కలెక్షన్స్ తేడా 5.76 కోట్లు మాత్రమే ఉన్నా గ్రాస్ లో ఎక్కువ తేడా ఉండటానికి కారణం, హిందీ లో, రెస్ట్ ఆఫ్ ఇండియా లో అండ్ ఓవర్సీస్ లో బాహుబలి 2 కలెక్షన్స్ ఎక్కువ ఉండటం తో అక్కడ లీడ్ బాహుబలి2 కి సొంతం అయింది… మొత్తం మీద ఆర్ ఆర్ ఆర్ మరియు బాహుబలి2 సినిమాలు ఇండియన్ మూవీస్ పరంగా బిగ్గెస్ట్ రికార్డులతో దుమ్ము దులిపేశాయి.