బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండియన్ బిగ్గెస్ట్ కలెక్షన్స్ తో ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ మూవీ బాహుబలి 2 రేంజ్ లో రచ్చ రచ్చ చేస్తుంది, ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఈ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మొదటి వారాన్ని రికార్డులు బ్రేక్ చేసి సంచలనం సృష్టించాయి అని చెప్పాలి. కానీ ఆర్ ఆర్ ఆర్ మూవీ మొదటి వారానికి గాను…
ఓవరాల్ గా చూసుకుంటే బాహుబలి 2 రికార్డులను మాత్రం అందుకోలేక పోయింది అని చెప్పాలి… కానీ రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రం బాహుబలి 2 ని బ్రేక్ చేసి భారీ లీడ్ తో కొత్త రికార్డ్ ను అయితే ఆర్ ఆర్ ఆర్ నెలకొల్పింది అని చెప్పాలి. వీకెండ్ లో ఓవరాల్ గా…
షేర్ పరంగా సంచలన రికార్డ్ ను నమోదు చేసిన ఆర్ ఆర్ ఆర్ గ్రాస్ పరంగా బాహుబలి 2 ని అందుకోలేదు ఇక వీక్ పూర్తీ అయ్యే టైం కి ఆర్ ఆర్ ఆర్ మూవీ 392 కోట్లకు పైగా షేర్ ని 710 కోట్ల దాకా గ్రాస్ ను సొంతం చేసుకుంది.
ఇదే టైం లో ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆఫ్ ఆల్ టైం బాహుబలి 2 మూవీ ఓవరాల్ గా 430 కోట్లకు తగ్గని షేర్ ని వరల్డ్ వైడ్ గా సొంతం చేసుకోగా గ్రాస్ 835 కోట్ల రేంజ్ లో ఉంది వరల్డ్ వైడ్ గా… రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆర్ ఆర్ ఆర్ లీడ్ లో ఉన్నా బాహుబలి 2 మూవీ హిందీ, తమిళ్, కర్ణాటక ఇలా అన్ని చోట్లా కూడా ఎక్స్ లెంట్ లీడ్ ను…
సొంతం చేసుకుని దుమ్ము లేపింది, ఓవర్సీస్ లో మాత్రం రెండు సినిమాలు చాలా బాగా పెర్ఫార్మ్ చేశాయి అని చెప్పాలి. మొత్తం మీద ఇప్పుడు ఇండియన్ మూవీస్ ఆల్ టైం టాప్ 2 బిగ్గెస్ట్ ఫస్ట్ వీక్ గ్రాస్ అండ్ షేర్ రికార్డ్ హోల్డర్స్ గా ఈ 2 సినిమాలు నిలిచాయి అని చెప్పాలి. ఇక ఆర్ ఆర్ ఆర్ లాంగ్ రన్ లో ఎంత దూరం వెళుతుందో చూడాలి.