Home న్యూస్ ఇండియన్ ఇండస్ట్రీ హిట్ బాహుబలి2 కి 7 ఏళ్ళు…బిజినెస్ అండ్ కలెక్షన్స్ ఇవే!

ఇండియన్ ఇండస్ట్రీ హిట్ బాహుబలి2 కి 7 ఏళ్ళు…బిజినెస్ అండ్ కలెక్షన్స్ ఇవే!

0

తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా ఎప్పటికీ నిలిచి పోయే సినిమాలు బాహుబలి సిరీస్….తెలుగు సినిమా మార్కెట్ రేంజ్ ను మరో లెవల్ కి పెంచేసిన బాహుబలి సిరీస్ లో రెండో పార్ట్ ఆల్ ఇండియా వైడ్ గా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది…ఆ రికార్డులు ఇప్పటికీ అలాగే ఉండటం బాహుబలి2 సృష్టించిన సునామీకి నిదర్శనం…

తెలుగు రాష్ట్రాలలో రికార్డులు, తమిళనాడులో రికార్డులు, కర్ణాటక కేరళ అన్ని చోట్లా దుమ్ము లేపిన ఈ సినిమా హిందీలో 500 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకున్న మొదటి సినిమాగా రికార్డ్ సృష్టించగా ఆ రికార్డ్ లాస్ట్ ఇయర్ దాకా అలానే ఉండటం విశేషం. ఓవరాల్ గా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో టోటల్ రన్ లో….

Baahubali2 Completes 7 Years….Business and Total Collections
204 కోట్ల షేర్ ని అందుకుని చరిత్రకెక్కింది…330 కోట్ల గ్రాస్ ను అందుకుంది. హిందీలో 511 కోట్ల నెట్ కలెక్షన్స్ ని సాధించింది. తమిళ్ లో 150 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకుంది. ఇలా అన్ని చోట్లా రికార్డుల ఊచకోత కోసిన ఈ సినిమా 352 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకోగా టోటల్ రన్ లో ఇండియన్ సినిమా హిస్టరీలోనే….

ఏ సినిమా కలలో కూడా ఊహించని రేంజ్ లో 860 కోట్ల మమ్మోత్ షేర్ ని 1810 కోట్ల రేంజ్ లో ఎపిక్ గ్రాస్ ను సొంతం చేసుకుంది…. 352 కోట్ల బిజినెస్ మీద టోటల్ రన్ లో 508 కోట్ల హిస్టారికల్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది. తెలుగు వర్షన్ టోటల్ రన్ లో 320 కోట్ల మమ్మోత్ షేర్ ని అందుకుని చరిత్ర సృష్టించింది….

వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన షేర్ అండ్ గ్రాస్ కలెక్షన్స్ రికార్డులు ఇప్పట్లో బ్రేక్ అవ్వడం కష్టమే….ఇలాంటి ఎపిక్ రికార్డులతో ఇండియా మొత్తాన్ని షేక్ చేసిన బాహుబలి2 రిలీజ్ అయ్యి 7 ఏళ్ళు కంప్లీట్ అయ్యింది…7 ఏళ్ళుగా అలాగే ఉన్న బాహుబలి2 రికార్డులను ఫ్యూచర్ లో ఏ సినిమా అయినా బ్రేక్ చేసే ఛాన్స్ ఉందో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here