నట సింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను ల కాంబినేషన్ పై క్రేజ్ ఎప్పుడూ ఓ రేంజ్ లోనే ఉంటుందని లేటెస్ట్ గా వచ్చిన మూడో సినిమా టీసర్ గ్లిమ్స్ నిరూపించింది. ఇటు బాలయ్య అటు బోయపాటి బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాఫ్స్ ని ఎదురుకుని లో లోనే ఉన్నా కానీ టీసర్ ఇచ్చిన ఊపు అంతా ఇంతా కాదనే చెప్పాలి. టీసర్ రిలీజ్ కి ముందు సినిమా ను చాలా…
తక్కువ బడ్జెట్ లో రూపొందించాలని ఇటు బాలయ్య అటు బోయపాటి రెమ్యునరేషన్ ని బాగా తగ్గించుకొబోతున్నారని వార్తలు గట్టిగానే ప్రచారం లో ఉండగా టీసర్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం తో లెక్కలన్నీ మారిపోయి నిర్మాత ఇప్పుడు బడ్జెట్ దృశ్యా ఎలాంటి అభ్యంతరాలు పెట్టడం లేదని రీసెంట్ గా…
తెలిసిన విషయం తెలిసిందే, ఇక ఇప్పుడు బోయపాటి రెమ్యూనరేషన్ గురించిన టాక్ కూడా ఇండస్ట్రీ లో గట్టిగానే వినిపిస్తుంది, ఆ వార్తల ప్రకారం సినిమా మొదలు పెట్టె ముందు 1.2 కోట్ల రేంజ్ రెమ్యునరేషన్ ని తీసుకోబోతున్నట్లు వార్తలు రాగా ఒకప్పుడు 10 కోట్ల నుండి 12 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకున్న బోయపాటి…
ఇప్పుడు చాలా తక్కువ రెమ్యునరేషన్ అందుకోబోతున్నాడు అని అంతా అనుకున్నారు. టీసర్ రిలీజ్ ముందు వరకు కూడా అలాగే పరిస్థితి ఉన్నప్పటికీ టీసర్ బ్లాక్ బస్టర్ తో బోయపాటి రెమ్యునరేషన్ కూడా 5 కోట్ల వరకు ఉంటుందని లేటెస్ట్ గా టాలీవుడ్ లో న్యూస్ చక్కర్లు కొడుతుంది. సినిమా కంప్లీట్ అయ్యే వరకు 2.5 కోట్లు… తర్వాత బిజినెస్ ని బట్టి మరో 2.5 కోట్ల మేర…
రెమ్యునరేషన్ బోయపాటి తీసుకోబోతున్నారని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం అన్నది ఇంకా తేలాల్సి ఉంది. ఇది మరీ ఇది వరకు తీసుకునే రేంజ్ కాకున్నా కానీ కొత్త సినిమా మొదలు పెట్టె ముందు ఇప్పుడు టీసర్ రిలీజ్ తర్వాత పెరగడం విశేషం అనే చెప్పాలి. ఇక బాలయ్య రెమ్యునరేషన్ లెక్కలు రివీల్ అవ్వాల్సి ఉంది….