యంగ్ హీరో కార్తికేయ(Karthikeya) నటించిన లేటెస్ట్ మూవీ బెదురులంక2012(Bedurulanka2012) టీసర్ ట్రైలర్ తో యూనిక్ మూవీగా అనిపించగా మంచి ప్రమోషన్స్ ని కూడా సొంతం చేసుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా భారీ గానే రిలీజ్ ను సొంతం చేసుకోగా సినిమా ఓవరాల్ గా ఎంతవరకు అంచనాలను అందుకుందో తెలుసుకుందాం పదండీ…
ముందుగా సినిమా స్టోరీ పాయింట్ విషయానికి వస్తే బెదురులంక అనే ఊరులో యుగాంతం రాబోతుంది అని తెలిసిన ప్రజలు ఎలా రియాక్ట్ అయ్యారు, ఈ యుగాంతాన్ని వాడుకుని కొందరు ఎలా ఎదగాలని చూశారు…హీరో వీళ్ళని ఆపాడా లేదా అన్న విషయాలు అన్ని సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…
సినిమా కాన్సెప్ట్ యూనిక్ గా అనిపించగా సినిమా స్టార్ట్ అవ్వడం కూడా బాగానే స్టార్ట్ అవుతుంది, కానీ కథలోకి వెళ్ళే ప్రాసెస్ లో టైం పట్టగా అక్కడక్కడా కామెడీ సీన్స్ పర్వాలేదు అనిపించేలా ఉంటూ ఫస్టాఫ్ ఓవరాల్ గా ఒకేలా అనిపించగా సెకెండ్ ఆఫ్ లో మాత్రం కామెడీ సీన్స్ చాలా వరకు ఆకట్టుకున్నాయి… ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ పోర్షన్ మొత్తం మెప్పించడంతో…
సినిమా పర్వాలేదు బాగుంది అనిపించేలా ముగుస్తుంది… కార్తికేయ బాగానే నటించి మెప్పించగా కార్తికేయకి ఏమాత్రం తీసిపోని విధంగా కామెడీ బ్యాచ్ మొత్తం తమ కామెడీతో మెప్పించారు… కొంచం డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఇబ్బంది పెట్టినా టార్గెట్ ఆడియన్స్ కి బాగానే అనిపించవచ్చు…
హీరోయిన్ నేహా శెట్టి రోల్ కూడా పర్వాలేదు అనిపించగా హీరో హీరోయిన్స్ లవ్ సీన్స్ కొన్ని చోట్ల సినిమాకి అడ్డంకిలా అనిపించాయి… ఇక మణిశర్మ సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగా సెట్ అయ్యాయి. ముఖ్యంగా బ్యాగ్రౌండ్ స్కోర్ ఎక్స్ లెంట్ గా ఉండటం విశేషం…
ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే మరింత టైట్ గా చేసి లెంత్ ని మరింతగా తగ్గించి ఉంటే బాగుండేది… ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాటోగ్రఫీ అన్నీ బాగుండగా డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ యూనిక్ గా ఉండగా ఒక ఊరికి ఆ పాయింట్ ని జోడించి అనేక ఇతర చిన్న కథలను అల్లుకుని ఉన్నంతలో బాగానే చెప్పాడని చెప్పొచ్చు…
కానీ కొంచం డబుల్ మీనింగ్ డైలాగ్స్, లాగ్, లెంత్ ఎక్కువ అవ్వడం లాంటివి మైనస్ లు అయితే సినిమాలో ఉన్నాయి… ఓవరాల్ గా ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్ కి వెళ్ళే ఆడియన్స్ కి సినిమా కొంచం అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా ఈజీగా ఒకసారి చూసేలా ఉంటుంది…. డబుల్ మీనింగ్ డైలాగ్స్ లాంటివి నచ్చని ఆడియన్స్ కి సినిమా యావరేజ్ లా అనిపించవచ్చు…
కానీ సినిమా నేపధ్యం, ఊరి చుట్టూ అల్లుకున్న రూరల్ కథ కాబట్టి సినిమాలో ఇలాంటివి ఉండటం కామన్, మొత్తం మీద మరీ హిలేరియస్ కామెడీ ఎంటర్ టైనర్ కాదు ఉన్నంతలో టికెట్ డబ్బులకు చాలా వరకు న్యాయం చేసేలా సినిమా ఉంటుంది… సినిమా కి ఫైనల్ గా మా రేటింగ్ 2.75 స్టార్స్….