Home న్యూస్ ఎట్టకేలకు….ఏడాదిన్నరకి బాలీవుడ్ నంబర్ 1….20 రోజులకు వచ్చింది ఇది!

ఎట్టకేలకు….ఏడాదిన్నరకి బాలీవుడ్ నంబర్ 1….20 రోజులకు వచ్చింది ఇది!

0

లాస్ట్ ఇయర్ ఫస్ట్ వేవ్ అండ్ ఈ ఇయర్ సెకెండ్ వేవ్ ల తర్వాత ఇతర ఇండస్ట్రీలు ఎలాగోలా కోలుకోవడానికి ట్రై చేస్తున్నాయి, టాలీవుడ్ మిగిలిన ఇండస్ట్రీల కన్నా ముందు నిలువగా ఇతర ఇండస్ట్రీలు కూడా కోలుకుంటున్నాయి కానీ బాలీవుడ్ ఇండస్ట్రీ మాత్రం ఏడాదిన్నర నుండి ఏమాత్రం కోలుకోలేక పోవడం విచారకరం అనే చెప్పాలి…చాలా సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ చేయాలనీ అనుకుంటున్నా కానీ జనాలు థియేటర్స్ కి వస్తారో రారో అన్న డౌట్….

కలెక్షన్స్ వస్తాయో రావో అన్న అనుమానం వలన సినిమాలను డైరెక్ట్ గా డిజిటల్ లోనే రిలీజ్ చేయాలనీ చూస్తూ ఉండగా బాలీవుడ్ లో ఏడాదిన్నర టైం లో థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి సిద్ధం అయిన ఫస్ట్ టాప్ స్టార్ అక్షయ్ కుమార్ నటించిన బెల్ బాటం సినిమా…

సినిమా బాగానే ఉన్నా జనాలు థియేటర్స్ కి తరలి రాక పోవడం తో సినిమా కలెక్షన్స్ చాలా తక్కువగా మొదటి రోజుల్లో సొంతం అవ్వగా సినిమా అవే రేంజ్ కలెక్షన్స్ ని లాంగ్ రన్ లో కూడా సొంతం చేసుకుంటూ ఇప్పుడు బాలీవుడ్ తరుపున ఏడాదిన్నర టైం లో…

హైయెస్ట్ కలెక్షన్స్ ని సాధించిన సినిమాగా నిలిచింది. ఈ ఇయర్ జాన్వికాపూర్ నటించిన రూహి సినిమా వరల్డ్ వైడ్ గ్రాస్ 40 కోట్ల మార్క్ ని బ్రేక్ చేసి 20 రోజుల్లో 45.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సాధించింది. ఇండియా లో 29.2 కోట్ల నెట్ కలెక్షన్స్ ని ఇప్పటి వరకు సొంతం చేసుకున్న ఈ సినిమా మొత్తం మీద ఇప్పటికీ కూడా లిమిటెడ్ థియేటర్స్ లో రన్ అవుతూ…

జనాలను కొద్ది కొద్దిగా థియేటర్స్ కి వచ్చేలా చేస్తుంది. కానీ సినిమా బడ్జెట్, బిజినెస్ రేంజ్ ఎక్కువ కాబట్టి ఆ లెక్కన నష్టాలు బాగానే వచ్చినా కానీ సినిమా ఓవరాల్ గా ఇప్పుడు ఏడాదిన్నర టైం లో హైయెస్ట్ కలెక్షన్స్ ని సాధించిన హిందీ మూవీ గా నిలిచింది అని చెప్పాలి… మరి ఈ సినిమా తర్వాత ఏ సినిమాలు రిలీజ్ కి సిద్ధం అవుతాయో చూడాలి ఇక.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here