కెరీర్ మొదలు పెట్టినప్పటి నుండి భారీ బడ్జెట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన బెల్లంకొండ శ్రీనివాస్, కమర్షియల్ సక్సెస్ లు దక్కకున్నా కానీ భారీ బడ్జెట్ సినిమాలను చేయడం ఆపలేదు, కానీ ఆ సినిమాలు సక్సెస్ కాకున్నా బెల్లంకొండ కి ఒక సర్టెన్ మార్కెట్ అయితే ఏర్పడింది… ఇంకా బాలీవుడ్ లో హిందీ డబ్బింగ్ మూవీస్ తో ఫుల్ పాపులారిటీని కూడా సొంతం చేసుకున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఇలాంటి టైం లో డేర్ స్టెప్ వేస్తూ…
ఏకంగా బాలీవుడ్ లో సినిమా చేయడానికి కూడా సిద్ధం అవ్వగా తెలుగు లో సూపర్ డూపర్ హిట్ అయిన ఛత్రపతి సినిమాను హిందీ లో రీమేక్ చేస్తూ భారీగా లాంచ్ అయ్యేలా ప్లాన్ చేసుకోగా వివి వినాయక్ డైరెక్షన్ లో ఈ సినిమాను కన్ఫాం చేశారు.
ఈ సినిమా కోసం కంప్లీట్ కొత్త మేక్ ఓవర్ కోసం ట్రై చేసి ఇప్పుడు మారిపోయిన టైం లో ఆల్ మోస్ట్ 80 కోట్ల రేంజ్ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు సెకెండ్ వేవ్ వలన నిరవధికంగా ఆగిపోవడం జరిగింది, మహారాష్ట్ర లో కేసులు తీవ్రంగా ఉండటం లాంటివి…
ఇబ్బంది పెట్టడం తో పరిస్థితులు నార్మల్ అయ్యాకే తిరిగి షూటింగ్ లలో పాల్గొనాలని అందరూ డిసైడ్ అయ్యారు. దాంతో ఈ సినిమా షూటింగ్ సెట్స్ పై జరగడానికి టైం చాలానే పట్టేలా ఉండటం తో ఈ గ్యాప్ లో మరో సినిమా చేయాలనీ డిసైడ్ అయిన బెల్లంకొండ రీసెంట్ గా ధనుష్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ కర్ణన్ తెలుగు రీమేక్ ని…
ఓకే చేయగా ఇప్పుడు ఈ గ్యాప్ లో ముందు కర్ణన్ తెలుగు రీమేక్ చేసిన తర్వాత ఛత్రపతి హిందీ రీమేక్ ను మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. అప్పటి వరకు ఈ 80 కోట్ల భారీ బడ్జెట్ రీమేక్ సినిమా ఆగిపోయినట్లే అని అంటున్నారు. బాక్ టు బాక్ రీమేక్స్ తో బెల్లంకొండ ఇప్పుడు టాలీవుడ్ అండ్ బాలీవుడ్ లో మార్కెట్ ని ఎక్స్ పాండ్ చేసుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు.