బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ సినిమాకి అయినా కూడా మాగ్జిమం ట్రేడ్ వర్గాలు సినిమాల బిజినెస్ లు అలాగే కలెక్షన్స్ లాంటివి రిలీజ్ చేస్తూ ఉంటారు, ఏరియాల వారిగా థియేటర్స్ లో బుకింగ్స్ రిపోర్ట్ ను బట్టి గ్రాస్ కలెక్షన్స్ ని ఎస్టిమేట్ చేసి ఆ తర్వాత షేర్ లెక్కలు వేయడం, ఏరియాల వారిగా డిస్ట్రిబ్యూటర్లు రిపోర్ట్ చేసే…
షేర్ లెక్కలు మ్యాచ్ అయితే అవి అప్ డేట్ చేయడం, కొంచం అటూ ఇటూ అయితే ఏవి ఒరిజినల్ కి దగ్గరగా అనిపిస్తాయో అవి చెప్పడం అన్నది చాలా వరకు జరుగుతూ ఉంటుంది, కానీ అప్పుడప్పుడు మేకర్స్ సినిమాల కలెక్షన్స్ ఇవే అంటూ రిలీజ్ చేస్తూ ఉంటారు…. కానీ లాస్ట్ ఇయర్ దసరా టైంలో…
మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) గాడ్ ఫాదర్ సినిమా ట్రేడ్ వాల్యూ బిజినెస్ కన్నా చాలా తక్కువ బిజినెస్ చేసింది అంటూ చెప్పుకొచ్చారు…. అదే విధంగా ఇప్పుడు ఈ ఇయర్ దసరాకి వచ్చిన నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన భగవంత్ కేసరి ట్రేడ్ లెక్కల్లో 18 రోజుల్లో…
ఆల్ మోస్ట్ 68 కోట్లకి దగ్గర అయ్యే రేంజ్ లో షేర్ ని అందుకోగా టీం మాత్రం సినిమా 70 కోట్ల షేర్ మార్క్ ని దాటింది అంటూ అనౌన్స్ చేశారు…మరీ ఎక్కువ డిఫెరెన్స్ లేక పోవడం విశేషం అయితే సినిమా బిజినెస్ మాత్రం 57.63 కోట్లు మాత్రమే అంటూ అనౌన్స్ చేయడం అందరినీ ఆశ్యర్యపరిచింది…
చాలా వరకు ఏ ప్రొడక్షన్ టీం కూడా తమ సినిమా బిజినెస్ ఇంత అయింది అంటూ అనౌన్స్ చేయరు.. కానీ ఫస్ట్ టైం ఇలా తమ సినిమా బిజినెస్ ఇంత అయింది అంటూ అనౌన్స్ చేయగా భగవంత్ కేసరిసినిమా వాల్యూ బిజినెస్ ఓన్ మరియు జరిగిన బిజినెస్ కలిపి దాదాపు అందరు ట్రేడ్ 66-68 కోట్ల మధ్యలో బిజినెస్ ను అప్ డేట్ చేశారు….
సినిమా రిలీజ్ కి ముందే ఈ బిజినెస్ ను అందరూ అప్ డేట్ చేయగా మేకర్స్ అప్పుడేమీ అనౌన్స్ చేయలేదు… ఇప్పుడు బ్రేక్ ఈవెన్ కి సినిమా కొంచం దూరంలో ఉండగా సినిమా బిజినెస్ ఇంత అని అలాగే బిజినెస్ మీద లాభం ఇంత వచ్చింది అంటూ అనౌన్స్ చేశారు…..కానీ ట్రేడ్ వర్గాలు అది ఓన్ రిలీజ్ ను కలిపి చెప్పని బిజినెస్ అని అంటున్నారు…
ఓవరాల్ గా సినిమా వాల్యూ అండ్ ఓన్ రిలీజ్ లు కలిపి ఓవరాల్ గా 67.35 కోట్ల బిజినెస్ రేంజ్ ను అందుకోగా 68.50 కోట్ల దాకా షేర్ ని అందుకుంటే సరిపోతుంది. ఆల్ మోస్ట్ 68 కోట్ల షేర్ ని అందుకున్న సినిమా మిగిలిన రన్ లో మిగిలిన మొత్తాన్ని అందుకుని లాభాలు కూడా కొద్దివరకు సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది.