బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ బెదురులంక2012(Bedurulanka 2012) సినిమాతో మంచి హిట్ ను సొంతం చేసుకున్న RX100 హీరో కార్తికేయ(Kartikeya) ఆ సినిమా తర్వాత చేస్తున్న కొత్త సినిమా భజే వాయువు వేగం(Bhaje Vaayu Vegam Movie) ఇప్పుడు ఆడియన్స్ ముందుకు ఈ నెల ఎండ్ లో రిలీజ్ అవ్వడానికి సిద్దం అవుతూ ఉండగా…
సినిమా భారీ పోటిలోనే రిలీజ్ కి సిద్ధం అవుతుంది, ఈ సినిమాకి పోటిలో మరో 2 నోటబుల్ మూవీస్ ఉండగా, ఓవరాల్ గా పేరుకు చిన్న సినిమాలానే అనిపించినా కూడా ఆల్ రెడీ బిజినెస్ డీల్స్ బాగానే సొంతం చేసుకుంటున్న ఈ సినిమా రీసెంట్ గా నాన్ థియేట్రికల్ బిజినెస్ ను పూర్తి చేసుకుంది…
యు వి క్రియేషన్స్ వాళ్ళు నిర్మిస్తున్న ఈ సినిమా క్వాలిటీ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా నిర్మించగా ఓవరాల్ గా నాన్ థియేట్రికల్ బిజినెస్ తో ఆల్ మోస్ట్ బడ్జెట్ మొత్తం రికవరీ అయ్యింది అన్న టాక్ అయితే వినిపిస్తుంది. సినిమా శాటిలైట్ రైట్స్ కింద ఆల్ మోస్ట్ 5 కోట్ల దాకా బిజినెస్ ను చేసిందట.
ఇక OTT రైట్స్ కింద ఆల్ మోస్ట్ 10 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకోగా మ్యూజిక్ రైట్స్ ఇతర రైట్స్ అన్నీ కలిపి ఆల్ మోస్ట్ టోటల్ నాన్ థియేట్రికల్ బిజినెస్ రేంజ్ 15.5 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక థియేట్రికల్ బిజినెస్ లెక్కలు ఇంకా తేలాల్సి ఉండగా…
కొన్ని ఏరియాల్లో సినిమాను ఓన్ గానే రిలీజ్ చేయనున్న మేకర్స్ కి థియేట్రికల్ రన్ లో వచ్చేవి టేబుల్ ప్రాఫిట్ ను తెచ్చిపెడతాయని అంటున్నారు. బెదురులంక సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న కార్తికేయ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మరో హిట్ ని తన ఖాతాలో వేసుకుంటాడో లేదో త్వరలో తేలనుంది.