Home న్యూస్ మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ తో రికార్డ్ కొట్టాడుగా!!

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ తో రికార్డ్ కొట్టాడుగా!!

0

వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో దూసుకు పోతున్న మలయాళ ఇండస్ట్రీ నుండి లేటెస్ట్ గా మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి(Mammootty) నటించిన లేటెస్ట్ మూవీ టర్బో(Turbo Movie 1st Day Collections)…రీసెంట్ గా రిలీజ్ అవ్వగా మరీ అద్బుతం కాదు కానీ ఎబో యావరేజ్ లెవల్ లో సినిమా ఉంది అన్న టాక్ అయితే వచ్చింది…

కానీ సినిమా మీద సాలిడ్ హైప్ ఉండటంతో ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ను మొదటి రోజున సొంతం చేసుకున్న ఈ సినిమా మమ్ముట్టి కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది ఇప్పుడు…తొలిరోజు కేరళలో వన్ ఆఫ్ ది హైయెస్ట్ ఓపెనింగ్స్ ను మలయాళ మూవీస్ లో సొంతం చేసుకున్న ఈ సినిమా…

వరల్డ్ వైడ్ గా మమ్ముట్టి కెరీర్ లో నంబర్ 1 కలెక్షన్స్ ని సాధించింది. తొలిరోజు కేరళలో ఈ సినిమా 6.20 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపింది… ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద సినిమా మొదటి రోజున మరో 90 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా…

ఓవర్సీస్ లో సెన్సేషనల్ స్టార్ట్ ను సొంతం చేసుకున్న సినిమా అక్కడ 7.10 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది. దాంతో మొదటి రోజు వరల్డ్ వైడ్ గా టర్బో సినిమా 14.20 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. టాక్ ఎలా ఉన్నా కూడా వీకెండ్ లో సినిమా మలయాళ మార్కెట్ లో బాగా కుమ్మేసే అవకాశం ఎంతైనా ఉందని అంటున్నారు ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here