Home న్యూస్ కార్తికేయ ‘భజే వాయు వేగం’ రివ్యూ….బాగుంది సినిమా!!

కార్తికేయ ‘భజే వాయు వేగం’ రివ్యూ….బాగుంది సినిమా!!

0

లాస్ట్ ఇయర్ బెదురులంక మూవీతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న యంగ్ హీరో కార్తికేయ(Kartikeya) ఆ సినిమా తర్వాత ఆడియన్స్ ముందుకు ఇప్పుడు భజే వాయు వేగం(Bhaje Vaayu Vegam Movie REVIEW Rating) సినిమాతో వచ్చేశాడు. ట్రైలర్ రిలీజ్ తర్వాత ఇంటెన్స్ మూవీలా అనిపించిన ఈ సినిమా ఎంతవరకు ఆడియన్స్ ను మెప్పించిందో తెలుసుకుందాం పదండీ…

ముందుగా కథ పాయింట్ కి వస్తే చిన్నప్పుడే తల్లితండ్రులను కోల్పోయిన హీరోని తనికెళ్ళ భరణి పెంచుతాడు…తన పెద్దకొడుకు రాహుల్ టైసన్(Rahul Tyson) తో సమానంగా చూసుకుంటాడు….చాలా సామాన్యంగా పెరిగిన ఈ అన్నదమ్ములు అనుకోకుండా విలన్స్ తో గొడవ జరుగుతుంది…ఆ తర్వాత కథ ఏమయింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…

కొన్ని సినిమాలు స్టార్ట్ అవ్వడం ఆసక్తిగా స్టార్ట్ అయ్యి తర్వాత స్లో అవుతాయి, కొన్ని సినిమాలు స్లోగా స్టార్ట్ అయ్యి తర్వాత పుంజుకుంటాయి…సరిగ్గా ఈ కోవలోకే వెళుతుంది భజే వాయు వేగం సినిమా…సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ 30 నిమిషాల వరకు స్లోగా సాగుతూ ఎక్కడో తేడా కొడుతుంది ఏంటి అని అనిపిస్తుంది, కానీ అసలు కథలోకి ఎంటర్ అయిన తర్వాత…

ట్విస్ట్ లు, టర్న్ లు ఆసక్తి కలిగించేలా డైరెక్టర్ మలిచిన తీరుతో సెకెండ్ ఆఫ్ అయ్యే టైంకి ఓ మంచి సినిమా చూసిన ఫీలింగ్ తో ఆడియన్స్ థియేటర్స్ బయటికి రావడం ఖాయమని చెప్పాలి…కార్తికేయ మరోసారి మంచి యాక్టింగ్ తో మెప్పించాడు, యాక్షన్ సీన్స్ లో కూడా ఆకట్టుకున్నాడు… ఇక కొంత గ్యాప్ తర్వాత సినిమాల్లో కనిపించిన రాహుల్ టైసన్ తన రోల్ వరకు బాగా నటించి మెప్పించగా…

హీరోయిన్ గా ఐశ్వర్య మీనన్ బాగానే యాక్ట్ చేసింది. మిగిలిన యాక్టర్స్ లో తనికెళ్ళ భరణి కి మంచి రోల్ దక్కగా విలన్ గా రవి శంకర్ బాగా నటించాడు… పాటలు సినిమాకి అంతగా ప్లస్ అవ్వలేక పోయాయి… కానీ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగానే మెప్పించగా, ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ లో టేక్ ఆఫ్ కి టైం తీసుకున్నా తర్వాత బాగా మెప్పించింది..

సినిమాటోగ్రఫీ మెప్పించగా, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఆకట్టుకున్నాయి. ఇక డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ బాగుండగా ముందే చెప్పినట్లు స్లో గా స్టార్ట్ చేసి కథలో ఆడియన్స్ ను ఇన్వాల్వ్ చేసి ఇద్దరు సామాన్య అన్నదమ్ములు మరో ఇద్దరు బలమైన విలన్స్ తో ఎలా పోరాడారో అన్నది బాగా చూపించాడు, కొన్ని చోట్ల ట్విస్ట్ లు బాగా ఆకట్టుకోగా క్లైమాక్స్ పర్వాలేదు అనిపించేలా ఉంటుంది…

అక్కడక్కడా కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ కూడా సినిమా ఎండ్ అయ్యే టైంకి ఆడియన్స్ ఓ మంచి సినిమా చూసిన ఫీలింగ్ తోనే బయటికి వస్తారు. మధ్య మధ్యలో కొంచం డ్రాగ్ అవ్వకుండా ఉండి, కథ టేక్ ఆఫ్ కి మరీ ఎక్కువ టైం తీసుకోకుండా ఉండి ఉంటే సినిమా ఇంకా బాగా మెప్పించేది. అయినా కానీ ఆడియన్స్ ని ఈ సినిమా నిరాశ అయితే పరచదు అని చెప్పాలి. సినిమా కి మా రేటింగ్ 2.75 స్టార్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here