కెరీర్ మొదలు పెట్టడం వరుస విజయాలతో మొదలు పెట్టి బాక్ టు బాక్ హాట్రిక్ విజయాలను దక్కించుకున్న యంగ్ హీరో రాజ్ తరుణ్(Raj Tarun) ఆ టైంలో అప్ కమింగ్ స్టార్స్ లో మంచి ప్రామిసింగ్ హీరోలా అనిపించాడు…లెక్కకు మిక్కిలి ఆఫర్స్ కూడా వెల్లువలా వచ్చేశాయి, కానీ తర్వాత నుండి ఒక్క సినిమా కూడా…
ఆడియన్స్ ను అలరించడంలో సఫలం అవ్వలేదు…దాంతో బాక్ టు బాక్ ఫ్లాఫ్స్ తో తన మార్కెట్ మొత్తాన్ని కోల్పోయిన రాజ్ తరుణ్ నటించిన రీసెంట్ మూవీస్ ఏవి కూడా ఆడియన్స్ ను అలరించడంలో మినిమమ్ ఇంపాక్ట్ ను కూడా చూపించ లేక పోయాయి..
లేటెస్ట్ గా ఆడియన్స్ ముందుకు రాజ్ తరుణ్ నటించిన భలే ఉన్నాడే(Bhale Unnade Collections) తో వచ్చిన రాజ్ తరుణ్ ట్రైలర్ బాగానే వర్కౌట్ అవ్వడంతో ఈ సారి హిట్ కొడతాడు అనుకున్నా మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా…
ఏ దశలో కూడా తేరుకోలేక పోయింది. దాంతో మొదటి వారంలో అతి కష్టం మీద 60 లక్షల రేంజ్ లోనే గ్రాస్ ను అందుకున్న సినిమా మిగిలిన రన్ లో మరో 15 లక్షల రేంజ్ లోనే గ్రాస్ ను సాధించి టోటల్ గా 75 లక్షల రేంజ్ లో గ్రాస్ ను 30లక్షలకు పైగా షేర్ ని మాత్రమే సొంతం చేసుకుని…
బాక్స్ అఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది… సినిమా రాజ్ తరుణ్ ఖాతాలో మరో డిసాస్టర్ మూవీగా నిలవగా డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ లాంటివి తీసేస్తే మినిమమ్ షేర్ కూడా ఉండదు అనే చెప్పాలి. ఇక ఫ్యూచర్ లో అయినా రాజ్ తరుణ్ ఏదైనా మంచి సినిమాతో కంబ్యాక్ ఇస్తాడో లేదో చూడాలి.