Home న్యూస్ భారతీయుడు2 రివ్యూ…ఏంటి సామి ఇదీ!!

భారతీయుడు2 రివ్యూ…ఏంటి సామి ఇదీ!!

1
Bharateeyudu2/Indian2 Movie Review Rating(Telugu)
Bharateeyudu2/Indian2 Movie Review Rating(Telugu)

చాలా కాలంగా డిలే అవుతూ వచ్చిన లోక నాయకుడు కమల్ హాసన్(Kamal Haasan) మరియు శంకర్(Shankar) ల క్రేజీ కాంబోలో రూపొందిన మూవీ భారతీయుడు2 (Bharateeyudu2 Movie Review) సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ లెవల్ లో రిలీజ్ ను సొంతం చేసుకుంది…మొదటి పార్ట్ అప్పట్లో పెను సంచలనం సృష్టించింది, మరి సీక్వెల్ ఎంతవరకు అంచనాలను అందుకుందో తెలుసుకుందాం పదండీ…

కథ పాయింట్ కి వస్తే…ఇండియాలో ప్రస్తుతం అడుగడుగునా జరుగుతున్నా అన్యాయాలు, అక్రమాలు, లంచగొండితనం ఇవన్నీ చూసి తట్టుకొని సిద్దార్థ్ అలాగే తన ఫ్రెండ్స్ భారతీయుడు మళ్ళీ వస్తే బాగుణ్ణు అనుకుంటూ ఉండగా ఈ విషయం భారతీయుడు దాకా వెళ్లి తను తిరిగి వస్తాడు…తను తిరిగి వచ్చిన తర్వాత ఏం జరిగింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…

ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుండే ఇది ఔట్ డేటెడ్ కథగా అనిపించింది, కానీ శంకర్ డైరెక్ట్ చేస్తున్న సినిమా అవ్వడంతో కచ్చితంగా మినిమమ్ గ్యారెంటీ ఔట్ పుట్ ఇస్తాడు అన్న నమ్మకంతో ఆడియన్స్ థియేటర్స్ వెళతారు. మొదటి 20 నిమిషాల కథ పర్వాలేదు అనిపించేలా సాగినా కూడా…

అసలు కథ మొదలు అవ్వడానికి చాలానే టైం పట్టడం, కమల్ హసన్ ఓల్డ్ గెటప్ ఏమాత్రం సెట్ అయినట్లు అనిపించకపోవడం, చాలా నార్మల్ కథని చాలా సేపు సాగదీయడంతో ఏ దశలో కూడా సినిమా అంచనాలను అందుకున్నట్లు అనిపించలేదు…దానికి తోడూ పార్ట్ 3 కోసం చాలా సీన్స్ ను సాంగ్స్ ను కూడా దాచేసి…

పార్ట్ 2 ని చాలా ఫ్లాట్ గా మార్చేశాడు శంకర్…. దాంతో అక్కడక్కడా కొన్ని సీన్స్ మినహా భారతీయుడు2 అంచనాలను అందుకోలేక పోయింది…కమల్ హాసన్ పెర్ఫార్మెన్స్ పర్వాలేదు అనిపించినా డిఫెరెంట్ గెటప్స్ చూపించిన ప్రతీ సారి ఆడియన్స్ కి స్క్రీన్ మీద సేనాపతి ఏజ్ గుర్తుకి వచ్చి ఈ ఏజ్ లో ఈ స్టంట్స్ ఏంటి అని అనిపించడం ఖాయం…

ఉన్నంతలో సిద్దార్థ్ రోల్ పర్వాలేదు అనిపించినా మ్యూజిక్ విషయంలో అనిరుద్ రీసెంట్ టైంలో వీకేస్ట్ వర్క్ ఈ సినిమానే అని చెప్పాలి. ఇక ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే చాలా వీక్ గా ఉంది…సినిమాటోగ్రఫీ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మెప్పించాయి…కానీ డైరెక్షన్ పరంగా అసలు ఈ సినిమా శంకరే తీశాడా అనిపించేలా ఉంటుంది….

కొన్ని సీన్స్ బాగానే అనిపించినా ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ పార్ట్ 3 గ్లిమ్స్ పర్వాలేదు అనిపించినా కూడా సినిమా చూసిన ఆడియన్స్ కి పార్ట్ 3 లో కథ పెట్టుకుని పార్ట్ 2 ని ఎందుకని తీసినట్లు అనిపించడం ఖాయం… శంకర్ డైరెక్షన్ అంటే ఆడియన్స్ లో అంచనాలు ఉంటాయి…ఆ అంచనాలను…

భారతీయుడు2 అందుకోలేక పోయింది. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్ కి వెళితే కొంచం ఓపిక ఎక్కువ చేసుకుని చూస్తె కొంచం పర్వాలేదు అనిపించవచ్చు ఏమో కానీ చాలా ఓపిక అవసరం…. ఓవరాల్ గా శంకర్ డైరెక్షన్ లో వచ్చిన వీకేస్ట్ మూవీస్ లో ఈ సినిమా ఒకటిగా చేరుతుంది… ఓవరాల్ గా సినిమాకి మా రేటింగ్ 2 స్టార్స్….

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here