లోక నాయకుడు కమల్ హాసన్(Kamal Haasan) మరియు శంకర్(Shankar) ల క్రేజీ కాంబోలో ఆడియన్స్ ముందుకు వరల్డ్ వైడ్ గా భారీ లెవల్ లో రిలీజ్ అయిన లేటెస్ట్ మూవీ భారతీయుడు2 (Bharateeyudu2 Movie Review) సినిమా ఎప్పుడో రావాల్సింది కానీ అనేక సార్లు డిలే అయ్యి ఇప్పుడు ఎట్టకేలకు రిలీజ్ అయ్యింది…
ముందుగా ప్రీమియర్స్ ను పూర్తి చేసుకున్న సినిమాకి అక్కడ నుండి ఫస్ట్ టాక్ బయటికి వచ్చేసింది…ఓవరాల్ గా కథ పాయింట్ ని పూర్తిగా రివీల్ చేయడం లేదు కానీ ఇండియాని వదిలివెళ్ళిన భారతీయుడు ఎక్కడ ఉన్నాడో ఎవ్వరికీ తెలియదు…మరో పక్క టైం గడిచి మళ్ళీ లంచగొండితనం, ఇతర అనేక సమస్యలు ఇండియాని పట్టి పీడిస్తున్న వేల…
తిరిగి భారతీయుడు రావాలని అందరూ కోరుకుంటారు…ఇక భారతీయుడు తిరిగి వచ్చిన తర్వాత ఏం చేశాడు అన్నది మొత్తం మీద కథ పాయింట్….భారతీయుడు కథ పాయింట్ అప్పట్లో సంచలనం కానీ ఆ తర్వాత ఆ పాయింట్ ని అరిగిపోయేదాకా ఎన్నో సార్లు ఎన్నో విధాలుగా వాడారు…
అలాంటి కథ పాయింట్ నే మళ్ళీ సీక్వెల్ పేరుతో డైరెక్టర్ శంకర్ కొత్తగా చెప్పే ప్రయత్నం చేయగా ఎమోషనల్ సీన్స్ కొన్ని మెప్పించగా కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే ఆకట్టుకున్నా కూడా ఓవరాల్ గా కథ చాలా పెద్దదిగా అనిపించడం, లెంత్ చాలా ఎక్కువ అయిన ఫీలింగ్ కలిగింది అని చెప్పాలి…
ఫస్టాఫ్ లో కథ టేక్ ఆఫ్ కి చాలా టైం పట్టగా భారతీయుడు ఎంట్రీ నుండి అసలు కథ మొదలు అవుతుందని మంచి పాయింట్ తో ఇంటర్వెల్ ఎపిసోడ్ ఆ తర్వాత సెకెండ్ ఆఫ్ పై అంచనాలు పెంచగా సెకెండ్ ఆఫ్ లో కథ మళ్ళీ అక్కడక్కడా డ్రాగ్ అయినా ప్రీ క్లైమాక్స్ నుండి ఊపు వచ్చి మంచి పాయింట్ తో…
ఎండ్ అయ్యి పార్ట్ 3 పై ఆశలు పెరిగేలా చేస్తుంది… ఓవరాల్ గా చెప్పాలి అంటే కమల్ హాసన్ మరియు శంకర్ లు మునుపటి రేంజ్ లో మ్యాజిక్ చేయలేదు కానీ ఉన్నంతలో పర్వాలేదు అనిపించే రేంజ్ ఔట్ పుట్ ఇచ్చారని చెప్పొచ్చు…. లెంత్ తగ్గించి మరింత టైట్ స్క్రీన్ ప్లే పెట్టి ఉంటే…
సినిమా మరింత ఆకట్టుకునేదని చెప్పొచ్చు… ఓవరాల్ గా ప్రీమియర్స్ అయిన తర్వాత సినిమా కి యావరేజ్ లెవల్ లో టాక్ వినిపిస్తుంది… కానీ రెగ్యులర్ ఆడియన్స్ కి సినిమాలో కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ ఉండటంతో వాళ్ళ నుండి ఇంకా బెటర్ టాక్ వస్తే మట్టుకు సినిమా…
బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి జోరు చూపించడానికి అవకాశం ఉందని చెప్పొచ్చు. ఓవరాల్ గా ప్రీమియర్స్ కంప్లీట్ అయిన తర్వాత పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న భారతీయుడు2 ఇక రెగ్యులర్ షోలకు ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి ఇక….