బాక్స్ ఆఫీస్ దగ్గర శంకర్(Shankar) డైరెక్షన్ లో కమల్ హాసన్(Kamal Haasan) నటించిన భారతీయుడు(Bharateeyudu) సినిమా అప్పట్లో అద్బుతాలు సృష్టించింది…ఆ సినిమాకి సీక్వెల్ గా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు భారతీయుడు2(Bharateeyudu2 Movie) జులై లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్నా…
ఎలక్షన్స్ వలన పోస్ట్ పోన్ అయ్యి ఇప్పుడు రిలీజ్ కి సిద్ధం అవుతుంది. మంచి అంచనాలు ఉన్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ని మించి మ్యాజిక్ చేస్తుంది అని అందరూ ఆశిస్తూ ఉండగా రీసెంట్ గా సినిమా ను అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో ప్రొఫైల్ ని అప్ డేట్ చేస్తూ సినిమా మెయిన్ స్టోరీ పాయింట్ ని కూడా అప్ డేట్ చేశారు..
అక్కడ సినిమా మెయిన్ కథ పాయింట్ ఇప్పుడు సోషల్ మీడియాలో లీక్ అయింది. ఫస్ట్ పార్ట్ లో లంచాలు తీసుకునే వారిని చంపే భారతీయుడు ఆఖరికి తన కొడుకుని కూడా వదలడు…తర్వాత ఇండియా వదిలి వెళ్ళిపోయినా కూడా ఇండియా గురించి తెలుసుకుంటూ ఉన్న టైంలో….మళ్ళీ లంచగొండితనం పీడిస్తున్న టైంలో…
సిన్సియర్ ఆఫీసర్ అయిన సిద్దార్థ్(Siddharth) లంచాలు తీసుకునే వారిపై పోరాడుతూ ఉండగా తనకి అనేక సమస్యలు వస్తున్న టైంలో తనని కాపాడటానికి ఏకంగా భారతీయుడు రంగంలో దిగుతాడు, ఆ తర్వాత కథ ఏమయింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే అనేది సినిమా స్టోరీ పాయింట్ గా అప్ డేట్ చేశారు…
ఇలాంటి పాయింట్ తో చాలా సినిమాలే భారతీయుడు తర్వాత వచ్చాయి, కానీ ఈ కాన్సెప్ట్ సృష్టికర్త అయిన శంకర్ ఇప్పుడు ఆడియన్స్ కి నచ్చే విధంగా భారతీయుడు2 తీయబోతూ ఉండగా ప్రజెంట్ డిఫెరెంట్ టేస్ట్ ఉన్న ఆడియన్స్ కి కనుక ఈ కథ కనెక్ట్ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర భారతీయుడు2 సంచలనాలు సృష్టించే అవకాశం ఎంతైనా ఉంటుంది…