బాక్స్ ఆఫీస్ దగ్గర నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి(Bhagavanth Kesari) మూడు వారాలను పూర్తి చేసుకుని నాలుగో వారంలో అడుగు పెట్టగా సినిమా నాలుగో వీక్ లో కొత్త మూవీస్ నుండి పోటి ఎదురు అవ్వడంతో థియేటర్స్ ని చాలా వరకు కోల్పోయింది….
అయినా కానీ ఉన్న థియేటర్స్ లోనే సినిమా పర్వాలేదు అనిపించేలా కలెక్షన్స్ ని సాధిస్తూ పరుగును కొనసాగిస్తూ ఉండగా కొత్త సినిమాలు డబ్ మూవీస్ అవ్వడం రెండూ కూడా ఇక్కడ కొంచం మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడంతో కలెక్షన్స్ పరంగా పండగ వీకెండ్ లో…
అనుకున్న రేంజ్ లో జోరుని చూపించడం లేదు, దాంతో భగవంత్ కేసరి సినిమా కొంచం బెటర్ గా పెర్ఫార్మ్ చేసే ఏరియాల్లో కొత్త సినిమాల రిలీజ్ వలన థియేటర్స్ ని తొలగించగా ఇప్పుడు ఆ సినిమాల టాక్ ఇంపాక్ట్ వలన వాటి ప్లేస్ లో తిరిగి భగవంత్ కేసరిని తిరిగి ప్రదర్శిస్తున్నారు…..
ముఖ్యంగా సీడెడ్, గుంటూరు అలాగే నైజాంలో కొన్ని మెయిన్ సెంటర్స్ లో కొత్త సినిమాల ప్లేస్ లో భగవంత్ కేసరి సినిమా ను తిరిగి థియేటర్స్ లో ప్రదర్శితం చేస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. 25 రోజులను పూర్తి చేసుకున్న భగవంత్ కేసరి ఆల్ రెడీ బ్రేక్ ఈవెన్ ని పూర్తి చేసుకుని లాభాల మార్క్ వైపు అడుగు పెట్టగా సినిమాకి ఈ దీపావళి హాలిడేస్ లో తిరిగి కొద్ది వరకు లాభాలు పెంచుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.