బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ 2 సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) రెండు సినిమాలతో నిరాశ పరచగా ఈ ఇయర్ వాల్తేరు వీరయ్య(Waltair Veerayya) సినిమా తో మాసివ్ కంబ్యాక్ ను సొంతం చేసుకున్నాడు…
ఇక ఇప్పుడు ఆడియన్స్ ముందుకు చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ భోళా శంకర్(Bhola Shankar) ఆగస్ట్ లో ఆడియన్స్ ముందుకు రాబోతుంది ఇప్పుడు… ఇక ఈ సినిమా కి ఆల్ రెడీ ఇప్పటి నుండే మంచి బిజినెస్ ఆఫర్స్ వస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి.
కాగా ఈ ఇయర్ సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్య నైజాంలో మొత్తం మీద 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకోగా టోటల్ రన్ లో ఏకంగా డబుల్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని 36.26 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది…
ఇక ఇప్పుడు భోళా శంకర్ సినిమాకి నైజాం ఏరియా నుండి మరీ వాల్తేరు వీరయ్య ఫైనల్ కలెక్షన్స్ రేంజ్ లో ఆఫర్స్ రావడం లేదు కానీ మొత్తం మీద నైజాం ఏరియా నుండి ఈ సినిమా కి ఇప్పుడు బయ్యర్స్ నుండి 25-26 కోట్ల దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ ఆఫర్స్ వస్తున్నాయని సమాచారం…
మేకర్స్ 30 కోట్ల దాకా బిజినెస్ ఆఫర్స్ కోసం చూస్తున్నట్లు తెలుస్తుంది కానీ సేఫ్ సైడ్ కోసం 25-26 కోట్ల రేంజ్ ఆఫర్ కి ఓకే చేసే అవకాశం ఉందని ట్రేడ్ సమాచారం. మిగిలిన ఏరియాలలో కూడా మరీ ఎక్కువ కాకుండా వాల్తేరు వీరయ్య లెవల్ లోనే బిజినెస్ ఉండొచ్చని అంటున్నారు. త్వరలోనే మరిన్ని బిజినెస్ వివరాలు రివీల్ అయ్యే అవకాశం ఉంది.