బాక్స్ ఆఫీస్ దగ్గర మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటించిన లేటెస్ట్ మూవీ భోలా శంకర్(Bholaa Shankar) సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి మొదటి వారానికి సినిమా బాక్స్ దగ్గర పరుగును ఆల్ మోస్ట్ కంప్లీట్ చేసుకునే రేంజ్ లో నిరాశ పరిచింది ఇప్పుడు…
సినిమా రిజల్ట్ చూసి ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ టోటల్ ఇండస్ట్రీకి కూడా మైండ్ బ్లాంక్ అయింది అని చెప్పాలి. దానికి ప్రధాన కారణం రీమేక్ లు…. టాలీవుడ్ లో రీమేక్ ల ట్రెండ్ ఈ మధ్య పెరిగి పోగా అందులో ఏ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కౌట్ అవ్వలేదు…
రీసెంట్ గా వచ్చిన బ్రో మూవీ కూడా రీమేక్ అవ్వగా ఆ సినిమా రిజల్ట్ కూడా నిరాశ పరిచింది. కానీ ఉన్నంతలో ఆ సినిమా బెటర్ కలెక్షన్స్ నే సాధించింది. కానీ భోలా శంకర్ సినిమా తమిళ్ నుండి వచ్చిన వేదాలం సినిమా రీమేక్ గా తెరకెక్కగా….
ఆడియన్స్ ను మెప్పించడంలో తీవ్రంగా విఫలం అవ్వగా టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు కూడా ఇక మీదట రీమేక్ సినిమాలు చేయాలి అంటే భోలా శంకర్ రిజల్ట్ గుర్తుకు వచ్చి వెనక్కి తగ్గే రేంజ్ లో మైండ్ బ్లాంక్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర వాల్తేరు వీరయ్య లాంటి…
బ్లాక్ బస్టర్ తర్వాత ఇలాంటి రిజల్ట్ ను అయితే ఎవ్వరూ ఊహించలేదు… జనాలు ప్రస్తుతం ఒరిజినల్ కథలను, డిఫెరెంట్ జానర్ మూవీస్ టాలీవుడ్ హీరోల నుండి ఆశిస్తున్నారు. ఈ రీమేక్ లకు ఇక స్వస్తి పలకండి అంటూ ఇన్ డైరెక్ట్ గానే భోలా శంకర్ రిజల్ట్ తో…
చెప్పకనే చెప్పడంతో ఇక మీద టాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్ళు రీమేక్ లు అంటే పూర్తిగా వెనక్కి తగ్గే అవకాశం ఉంది. రీమేక్ లు చేయాలి అనుకునే హీరోలు సైతం భోలా శంకర్ రిజల్ట్ చూసి రీమేక్ లు ఒప్పుకోవడం కష్టమే అని చెప్పాలి. భోలాశంకర్ రిజల్ట్ వలన అప్ కమింగ్ డేస్ లో స్టార్స్ నుండి ఒరిజినల్ అండ్ కొత్త జానర్ మూవీస్ రావడం మాత్రం ఖాయమని చెప్పొచ్చు.