బాలీవుడ్ లో భారీ అంచనాల నడుమ ఈ దీపావళి కానుకగా రిలీజ్ అయిన సీక్వెల్ మూవీస్ లో రెండేళ్ళ క్రితం వచ్చిన భూల్ భులయ్యా2 సినిమా కి కొనసాగింపుగా ఆడియన్స్ ముందుకు వచ్చిన భూల్ భులయ్యా3(Bhool Bhulaiyaa 3 Review) సినిమా ఒకటి…కార్తీక్ ఆర్యన్ నటించిన ఈ మూడో పార్ట్ మీద మంచి అంచనాలు ఏర్పడగా సినిమా ఎంతవరకు అంచనాలను అందుకుందో తెలుసుకుందాం పదండీ…
కథ పాయింట్ కి వస్తే….పార్ట్ 2 లో దొంగ బాబా ఉన్నప్పటికీ పరిస్థితులను తట్టుకున్న హీరో…పార్ట్ 3 లో కూడా దయ్యాలను వదిలిస్తాను అంటూ జనాలను మోసం చేస్తూ ఉంటాడు…ఈ క్రమంలో హీరోయిన్ కి హీరో గురించి తెలిసి తనని బ్లాక్ మైల్ చేసి ఒక మహల్ లో దయ్యాన్ని వదిలించాలి అంటూ పట్టుకు వెళుతుంది….
అక్కడ అందరూ హీరోని నిజమైన బాబా అనుకుంటూ ఉండగా…కొంతకాలం ఎంజాయ్ చేసిన తర్వాత అక్కడ ఒరిజినల్ ఆత్మ అయిన మంజులిక ఉందని తెలుసుకుంటాడు…ఆ తర్వాత కథ ఏమయింది అన్నది మాత్రం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…..
మరోసారి బాలీవుడ్ వాళ్ళు రొటీన్ కథనే ఎంచుకుని తీసిన ఈ హర్రర్ కామెడీ మూవీ కాన్సెప్ట్ మన దగ్గర ఆల్ రెడీ అరిగిపోయింది, కానీ బాలీవుడ్ లో ఇప్పటికీ వర్కౌట్ అవ్వడంతో మరోసారి కూడా ఇది సఫలం అవుతుంది అని ఆశించి చేసిన ఈ సినిమా ఏమాత్రం ఇంప్రెస్ చేయలేక పోయింది…
కొన్ని సీన్స్ అండ్ ట్విస్ట్ లు బాగున్నా కూడా ప్రతీ సీన్ తర్వాత సీన్ ఆడియన్స్ ఈజీగా గెస్ చేసేలా ఉండటం, మ్యూజిక్ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వకపోవడంతో చాలా టైం ఆడియన్స్ బోర్ ఫీల్ అయ్యేలా చేసింది…. ఇంటర్వెల్ ఎపిసోడ్ అలాగే క్లైమాక్స్ ఎపిసోడ్ లు కొంచం పర్వాలేదు అనిపించినా…
మిగిలిన కథ మొత్తం కూడా చాలా చాలా డ్రాగ్ చేశారు…కామెడీ ఫోర్సుడ్ గా అనిపించినా కొన్ని చోట్ల వర్కౌట్ అయింది….కానీ హర్రర్ కామెడీ నేపధ్యంలో రీసెంట్ గా వచ్చిన స్త్రీ2 తో పోల్చితే ఏమాత్రం అంచనాలను అందుకోలేక పోయింది భూల్ భులయ్యా3 సినిమా….
స్టార్ కాస్ట్ చాలా పెద్దగా ఉన్నా హీరో కార్తీక్ ఆర్యన్ మరోసారి తన పెర్ఫార్మెన్స్ అండ్ ఎనర్జీతో కొంత వరకు ఆకట్టుకున్నా మిగిలిన యాక్టర్స్ అందరూ కూడా ఓవర్ యాక్షన్ తోనే సరిపెట్టారు…మొదటి పార్ట్ బాగానే హిట్ అవ్వగా రెండో పార్ట్ సీక్వెల్ ఫ్యాక్టర్ అండ్ డీసెంట్ కామెడీ వలన వర్కౌట్ అయింది…
కానీ మూడో పార్ట్ మొదటి రెండు సినిమాలతో పోల్చితే చాలా వీక్ గానే అనిపించింది అని చెప్పాలి. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్ కి వెళితే కొంచం ఓపిక చేసుకుని పడుతూ లేస్తూ సాగిన సినిమాని ఓపికగా చూస్తె యావరేజ్ గా అనిపించవచ్చు… సినిమాకి మా రేటింగ్ 2.25 స్టార్స్..