Home న్యూస్ ట్రైలర్ టాక్: కష్టాల్లో బాలీవుడ్…ఆదుకోవడానికి వస్తున్న చందు చాంపియన్!!

ట్రైలర్ టాక్: కష్టాల్లో బాలీవుడ్…ఆదుకోవడానికి వస్తున్న చందు చాంపియన్!!

0

బాలీవుడ్(Bollywood Industry) ప్రస్తుతం కష్టాల్లో ఉంది…బాక్స్ ఆఫీస్ దగ్గర మార్చ్ వరకు ఎలాగోలా పర్వాలేదు అనిపించేలా, కొన్ని మంచి సినిమాలు వచ్చినా కూడా తర్వాత మాత్రం నిరాశ కలిగించే సినిమాలే ఎక్కువగా వచ్చాయి. భారీ ఆశలు పెట్టుకున్న రంజాన్ పండగ మూవీస్ అట్టర్ డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకుని నిరాశ పరచగా….

ఇప్పటి వరకు కూడా ఒక్క డీసెంట్ మూవీ రాలేదు, రీసెంట్ గా వచ్చిన శ్రీకాంత్ అనే మూవీకి మంచి రివ్యూలు వచ్చినా వసూళ్లు అనుకున్న రేంజ్ లో రాలేదు. ఇలాంటి టైంలో ఓ మంచి సినిమా కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ఇప్పుడు బాలీవుడ్ ను ఆదుకోవడానికి యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్(Kartik Aaryan) నటించిన లేటెస్ట్ మూవీ చందు చాంపియన్(Chandu Champion Movie)….

జూన్ 14న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా రీసెంట్ గా సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు… ఇండియా నుండి ఫస్ట్ పారాలింపిక్ కి వెళ్ళిన మొదటి క్రీడాకారుడు అయిన మురళీకాంత్ పేట్కర్ లైఫ్ స్టోరీ బేస్ చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించారు…ట్రైలర్ ఆద్యంతం కూడా ఆసక్తిగా సాగింది అని చెప్పాలి.

భజరంగి భాయిజాన్ లాంటి బ్లాక్ బస్టర్ తీసిన కబీర్ ఖాన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా తో తిరిగి బాలీవుడ్ హిట్స్ కొట్టడం స్టార్ట్ చేస్తుంది అన్న నమ్మకంగా ఉన్నారు. ఇది వరకు కోవిడ్ టైంలో కూడా సరైన హిట్ లేని టైంలో కార్తీక్ ఆర్యన్ నటించిన భూల్ భులయ్య2 రిలీజ్ అయ్యి భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది…

మళ్ళీ ఇప్పుడు బాలీవుడ్ సరైన హిట్ లేక పోవడంతో స్టార్స్ నటించిన సినిమాల్లో ఓ మంచి హిట్ వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి టైంలో జూన్ 14న రిలీజ్ కాబోతున్న ఈ చందు చాంపియన్ సినిమా ఆడియన్స్ ను ఎంతవరకు థియేటర్స్ కి రప్పించి మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here