Home న్యూస్ ఆడియో రిలీజ్ కే…1.6 మిలియన్ ట్వీట్స్…వీళ్ళెం ఫ్యాన్స్ రా బాబు!!

ఆడియో రిలీజ్ కే…1.6 మిలియన్ ట్వీట్స్…వీళ్ళెం ఫ్యాన్స్ రా బాబు!!

0

     సోషల్ మీడియా లో స్టార్ హీరోల ఫాలోయింగ్ ఈ మధ్య పెరిగి పోతుంది, బర్త్ డే ట్రెండ్ లు, ఫస్ట్ లుక్ ట్రెండ్స్, టీసర్ ట్రైలర్ ట్రెండ్స్ ఇలా అనేక ట్రెండ్స్ జరుగుతున్నాయి. ఇక ఆడియో ఈవెంట్ జరుగుతున్నప్పుడు కూడా ట్రెండ్ జరుగుతుంది కానీ ట్వీట్ కౌంట్ చాలా తక్కువగా ఉంటుంది, కానీ రీసెంట్ గా కోలివుడ్ స్టార్ హీరో ఇలయ దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ బిగిల్ ఆడియో ఈవెంట్ జరిగింది.

మన టాలీవుడ్ లో లా లైవ్ టెలికాస్ట్ లాంటివి అక్కడ ఉండవు, ఆడియో ఈవెంట్ ని ఫస్ట్ షూట్ చేసి తర్వాత టివి చానెల్ లో ఎడిట్ చేసి టెలికాస్ట్ చేస్తారు, దాంతో బిగిల్ ఆడియో ఈవెంట్ లైవ్ లో ఉండదు కాబట్టి ఆ ఈవెంట్ జరిగే ప్రతీ అప్ డేట్ ని…

కోలివుడ్ ట్రేడ్ అండ్ బిగ్ వెబ్ సైట్స్ వాళ్ళు ఆ ఈవెంట్ కి అటెండ్ అయిన ఫ్యాన్స్ లైవ్ లో ట్వీట్స్ వేస్తూ ఒక కొత్త సినిమా లైవ్ రివ్యూ ఇస్తున్నట్లు ట్వీట్స్ వేయడం మొదలు పెట్టారు. చూస్తూ ఉండగానే ఆ ట్వీట్ కౌంట్ పెరుగుతూ పెరుగుతూ ఎకనగా 1 మిలియన్ ట్వీట్ కౌంట్ మార్క్ ని అందుకుంది.

ఇండియన్ సినిమా హిస్తరీ లోనే ఒక ఆడియో ఈవెంట్ పై అన్ని ట్వీట్స్ పడటం ఇదే తొలిసారి. టోటల్ గా రోజు ముగిసే సరికి 12 గంటలకు ఫైనల్ కౌంట్ ఏకంగా 1.6 మిలియన్ ట్వీట్ కౌంట్ ని దాటిందట. ఇది ఓ అద్బుతమైన రికార్డ్ అని చెప్పాలి. ఒక ఆడియో ఈవెంట్ కి ఈ రేంజ్..

హంగామా ఇదివరకు జరిగి ఉండదు. ఇక ఆ ఆడియో ఈవెంట్ ని ఆదివారం సన్ టీవీ లో టెలికాస్ట్ చేయనుండటం తో కొత్త సినిమా రేంజ్ లో TRP రేటింగ్ వస్తుందని అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా విజయ్ సోషల్ మీడియా ఫాలోయింగ్ మరో లెవల్ లో ఉందని చెప్పొచ్చు. ఈ సినిమా ఈ దీపావళి కి తమిళ్ తో పాటు తెలుగు లో కూడా రిలీజ్ కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here