Home న్యూస్ బింబిసార హౌస్ ఫుల్…సీతా రామం యునానిమస్!!

బింబిసార హౌస్ ఫుల్…సీతా రామం యునానిమస్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో 2 సినిమాలు ఆడియన్స్ ముందుకు వచ్చాయి. వాటిలో మాస్ అండ్ కమర్షియల్ మూవీ లవర్స్ కోసం బింబిసార. క్లాస్ అండ్ లవ్ స్టొరీ మూవీస్ లవర్స్ కోసం సీతా రామం రిలీజ్ అవ్వగా రిలీజ్ రోజున ఇక్కడ ఇంకా ఉదయం షోలు పడే సమయానికి బింబిసార సినిమాకి తెలుగు రాష్ట్రాలలో స్పెషల్ షోలు వేయగా అక్కడ చాలా సెంటర్స్ లో హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి.

రీసెంట్ టైం లో స్పెషల్ షోలు పడ్డ సినిమాలే లేవు, నార్మల్ షోలకే జనాలు రాని పరిస్థితి ఉన్న నేపధ్యంలో స్పెషల్ షోలు ఫుల్ అవ్వడం బింబిసారకే చెల్లింది. ఇక ఓవర్సీస్ లో ప్రీమియర్స్ పరంగా బింబిసార కన్నా ముందే భారీగా రిలీజ్ అయిన సీతారామం…

యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ తో ప్రీమియర్స్ ని పూర్తీ చేసుకుంది, సినిమా చూసిన ఓవర్సీస్ ఆడియన్స్ ఓ క్లాసిక్ లవ్ స్టొరీని చూశాం అంటూ చెబుతున్నారు. ఇక రెగ్యులర్ షోల టైం కి ఇక్కడ కూడా ఈ సినిమా క్లాస్ మూవీ లవర్స్ ని ఇంప్రెస్ చేసే అవకాశం ఉంది.

మొత్తం మీద 2 సినిమాలు బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడానికి సిద్ధం అవుతూ ఉండగా 2 సినిమాలకు పాజిటివ్ టాక్ ఆల్ మోస్ట్ కన్ఫాం అనే అనిపిస్తుంది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర గత 2 నెలలుగా టాలీవుడ్ ఎదురు చూస్తున్న హిట్స్ ఈ సినిమాలు ఇస్తాయో లేవో ఈ వీకెండ్ వరకు ఆగితే తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here