Home న్యూస్ బొమ్మరిల్లు రీ రిలీజ్ కలెక్షన్స్….రచ్చ చేసిన క్లాసిక్ మూవీ!

బొమ్మరిల్లు రీ రిలీజ్ కలెక్షన్స్….రచ్చ చేసిన క్లాసిక్ మూవీ!

0

టాలీవుడ్ లో వచ్చిన బెస్ట్ క్లాసిక్ మూవీస్ లో బొమ్మరిల్లు(Bommarillu Movie Re Release Collections) ఒకటి…. 2006 టైంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఒక సెన్సేషన్, క్లాస్ మూవీ అయినా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓ రేంజ్ లో రచ్చ లేపిన ఈ సినిమా ఆ టైంలోనే ఓవరాల్ గా 8.6 కోట్ల బిజినెస్ కి టోటల్ రన్ లో కంప్లీట్ అయ్యే టైంకి…

24 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని బిజినెస్ మీద 17.40 కోట్ల ప్రాఫిట్ తో ఎపిక్ క్లాసిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. టెలివిజన్ లో కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ రిపీటివ్ ఆడియన్స్ తో సక్సెస్ ని అందుకున్న ఈ సినిమా ఆడియో పరంగా ఇప్పటికీ ఫ్రెష్ గా ఫీల్ అయ్యేలా ఉంటుంది.

అలాంటి ఈ సినిమాను ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రీ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకున్న ఈ సినిమా రీ రిలీజ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని అందుకుని మాస్ రచ్చ చేసింది. సినిమా నైజాంలో మంచి జోరు చూపించగా…

టోటల్ గా నైజాంలో మొదటి రోజున 35 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకోగా అందులో హైదరాబాదు నుండే 32 లక్షలకు పైగా వసూళ్ళని సాధించింది. ఆంధ్రలో అనుకున్న రేంజ్ లో జోరు చూపించలేక పోయిన సినిమా 10 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని సాధించగా…

తెలుగు రాష్ట్రాల్లో 45 లక్షల రేంజ్ లో వసూళ్ళని మొదటి రోజు అందుకోగా రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 8 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా ఓవరాల్ గా ఇండియా వైడ్ గా మొదటి రోజున 53 లక్షల రేంజ్ లో ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది.

ఓవరాల్ గా అడ్వాన్స్ బుకింగ్స్ అండ్ డే 1 బుకింగ్స్ టికెట్ సేల్స్ 12 వేల రేంజ్ దాకా ఉండగా, మరీ భీభత్సం కాదు కానీ డీసెంట్ బుకింగ్స్ తో మంచి జోరునే సినిమా చూపించింది అని చెప్పాలి… ఒకప్పటి క్లాసిక్ మూవీ ని ఆడియన్స్ బాగానే తిరిగి రీ రిలీజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here