బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మరియు మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్(Sai Dharam Tej) ల కాంబినేషన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ బ్రో ది అవతార్(BRO The Avatar) సినిమా ఆడియన్స్ ముందుకు రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నా కూడా….
ఓపెనింగ్ వీకెండ్ తర్వాత కలెక్షన్స్ పరంగా మాత్రం అంచనాలను అందుకోలేక పోయింది. టోటల్ రన్ లో 98.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఫైనల్ రన్ లో 68.35 కోట్ల షేర్ ని అందుకుని టోటల్ గా 30.15 కోట్ల నష్టాన్ని సొంతం చేసుకుని పరుగును పూర్తి చేసుకోగా…
సినిమా తర్వాత డిజిటల్ లో రిలీజ్ అయ్యి అక్కడ మంచి వ్యూవర్ షిప్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా తర్వాత టెలివిజన్ లో టెలికాస్ట్ అవ్వడానికి కొంచం టైం తీసుకోగా జీ తెలుగు వాళ్ళు రీసెంట్ గా సినిమాను టెలివిజన్ లో మంచి ప్రమోషన్స్ చేసి టెలికాస్ట్ చేశారు….
కాగా సినిమా రీసెంట్ గా జీ తెలుగు లో టెలికాస్ట్ అవ్వగా ఫస్ట్ టైం టెలికాస్ట్ లో సినిమా కి వచ్చిన టి.ఆర్.పి రేటింగ్ కొంచం నిరాశ కలిగించే విధంగా వచ్చింది అని చెప్పాలి. ఓవరాల్ గా ఫస్ట్ టెలికాస్ట్ లో ఈ సినిమా కి 7.24 టి.ఆర్.పి రేటింగ్ ను మాత్రమే సొంతం చేసుకుని బిలోపార్…
రేటింగ్ ను సొంతం చేసుకుంది…. కొన్ని ఇతర చిన్న సినిమాలు ఇంకా బెటర్ రేటింగ్ లను సొంతం చేసుకోగా బ్రో లాంటి ఫ్యామిలీ మూవీ నుండి ఇంకా బెటర్ రేటింగ్ నే అందరూ ఎక్స్ పెర్ట్ చేశారని చెప్పొచ్చు. కానీ సినిమాకి ఫస్ట్ టెలికాస్ట్ లో అంతంత మాత్రమే టి.ఆర్.పి రాగా లాంగ్ రన్ లో ఎలాంటి రేటింగ్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.
Bro dark mode lo letters white colour lo undali