అప్పుడెప్పుడో శ్రీరస్తూ శుభమస్తూ సినిమాతో మంచి హిట్ కొట్టిన అల్లు శిరీష్(Allu Sirish) ఆ తర్వాత చేసిన ఏ సినిమా కూడా ఆడియన్స్ ను అలరించలేక పోయింది. రెండేళ్ళ క్రితం ఊర్వశివో రాక్షసివో సినిమాతో వచ్చిన అల్లు శిరీష్ ఇప్పుడు ఆ సినిమా తర్వాత బడ్డీ(Buddy Movie Telugu Review) తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు…
మరి ఈ సినిమాతో ఆడియన్స్ ను ఎంతవరకు మెప్పించాడో తెలుసుకుందాం పదండీ…కథ పాయింట్ కి వస్తే పైలట్ అయిన హీరో ఎయిర్ పోర్ట్ లో పనిచేసే హీరోయిన్ ని చూడకుండానే ఇష్టపడతాడు. హీరోయిన్ కూడా హీరో తనకి చేసిన హెల్ప్ వలన ఇష్టపడుతుంది… అనుకోకుండా విలన్ అజ్మల్ అమీర్ చేసిన ఎక్స్ పెరిమెంట్ లో హీరోయిన్ ఇరుక్కోగా…
తను కోమాలోకి వెళ్లి తన ఆత్మ ఒక టెడ్డీ బియర్ లోకి వెళుతుంది…ఆ టెడ్డీ బియర్ లో ఉన్నది తను ప్రేమించిన ఆత్మ అని తెలియకున్నా హీరో ఆ బొమ్మకి హెల్ప్ చేయాలి అనుకుంటాడు…ఇక ఆ తర్వాత కథ ఏమైంది అన్నది మాత్రం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.. కథ పాయింట్ చాలా సింపుల్ గానే ఉండగా…
లాజిక్ లు లాంటివి వెతకకుండా చూస్తె సీన్స్ వైజ్ సినిమా పర్వాలేదు బాగుంది అనిపించేలానే ఉంటుంది, కానీ హీరోకి హీరోయిన్ కి సరైన ప్రేమ కలిగించే సీన్స్ లేక పోవడం, ఆత్మ బొమ్మ లోకి వెళ్ళినా జనాలు ఎవ్వరూ భయపడకపోవడం, హీరో ఒక బొమ్మ కోసం వీర లెవల్ లో విన్యాసాలు చేయడం లాంటి లాజిక్ లేని సీన్స్ బొంచం ట్రాక్ తప్పినట్లు అనిపించినా…
చిన్న పిల్లల కోసం తీసిన సినిమా అంటూ చెబుతూ ఉండటం, పిల్లలు కోరుకునే ఎలిమెంట్స్ అయితే సినిమాలు ఉన్నాయి… టెడ్డీ బియర్ వేసిన స్టెప్స్, డైలాగ్స్….జై బాలయ్య అంటూ మెషీన్ గన్ కాల్చే సీన్ ఇలా ఆకట్టుకునే సన్నివేశాలు సినిమా లో ఉన్నాయి…
అల్లు శిరీష్ తన రోల్ వరకు పర్వాలేదు అనిపించేలా నటించగా హీరోయిన్ జస్ట్ ఓకే అనిపిస్తుంది. విలన్ గా అజ్మల్ పర్వాలేదు అనిపించగా మిగిలిన యాక్టర్స్ ఓకే…సంగీతం యావరేజ్ గా ఉండగా బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అలానే ఉంది… ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే చాలా నెమ్మదిగా సాగింది…
ముఖ్యంగా ఫస్టాఫ్ డ్రాగ్ అయిన ఫీలింగ్ కలగగా ప్రీ ఇంటర్వెల్ నుండి పర్వాలేదు అనిపించేలా కథ సాగింది. సెకెండ్ ఆఫ్ లో కథ ఫస్టాఫ్ కన్నా బెటర్ గా అనిపించింది… సినిమాటోగ్రఫీ బాగుండగా ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి…ఇక డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్…
ఈగ సినిమా మాదిరిగా మెప్పించే సత్తా ఉన్న పాయింట్ అయినా కూడా ఈగలో వర్కౌట్ అయిన ఎమోషన్స్ ఇక్కడ వర్కౌట్ అవ్వలేదు, అలాంటి సీన్స్ పడలేదు… మొత్తం మీద రెగ్యులర్ మూవీస్ చూసి బోర్ ఫీల్ అయ్యే ఆడియన్స్ ఈ సినిమా ను ట్రై చేయోచ్చు కానీ కొంచం ఓపిక అవసరం…
అదే టైంలో చిన్నపిల్లలకు టెడ్డీ బియర్ చేసే విన్యాసాలు కొంచం ఆకట్టుకునే అవకాశం ఉండటంతో వాళ్ళకి సినిమా బెటర్ ఆప్షన్ అని చెప్పాలి. ఇక మిగిలిన సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కొంచం ఓపికతో చూస్తె పర్వాలేదు అనిపించవచ్చు సినిమా… ఓవరాల్ గా సినిమాకి మా రేటింగ్ 2.5 స్టార్స్…