Home న్యూస్ బుజ్జి ఫ్రం కల్కి….స్పైడర్ ని గుర్తు చేశారు బాబోయ్….కానీ!

బుజ్జి ఫ్రం కల్కి….స్పైడర్ ని గుర్తు చేశారు బాబోయ్….కానీ!

0

పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటిస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి 2898AD( Kalki2898AD Movie) మీద అంచనాలు ఓ లెవల్ లో ఉన్నాయి. జూన్ ఎండ్ కి ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతున్న ఈ సినిమా కొంత గ్యాప్ తర్వాత ఈ ఇయర్ లో ఇండియా వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కానున్న బిగ్ మూవీ అవ్వడంతో….

సాలిడ్ ఓపెనింగ్స్ తో దుమ్ము దుమారం లేపే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక సినిమా నుండి రీసెంట్ గా కొత్త వీడియోని రిలీజ్ చేశారు….బుజ్జి అనే స్పెషల్ క్యారెక్టర్ సినిమాలో ఉంటుందని, ఆ క్యారెక్టర్ హీరోతో పాటు ట్రావెల్ అవుతుందని, ఆ రోల్ కి కీర్తి సురేష్(Keerthy Suresh) వాయిస్ ఓవర్ ఇస్తూ ఉండగా రీసెంట్ గా ఆ వీడియోని రిలీజ్ చేశారు…

సింపుల్ గా క్యూట్ గా ఉన్న ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తూ ఉండగా అదే టైంలో ఇలాంటి స్పెషల్ క్యారెక్టర్ రోల్ గురించిన వీడియోని ఇది వరకే టాలీవుడ్ లో రిలీజ్ చేశారు…అదే సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) మోస్ట్ హైప్ మూవీ అయిన స్పైడర్(SPYder Glimpse) గ్లిమ్స్ వీడియో…

కల్కి బుజ్జి వీడియో చూసిన వాళ్ళందరికీ స్పైడర్ గ్లిమ్స్ గుర్తుకు రావడం ఖాయం, అ గ్లిమ్స్ లో స్పైడర్ ను చూపించి మురగదాస్ సినిమా మీద హైప్ ను మరో లెవల్ కి తీసుకువెళ్లి తీరా సినిమా రిలీజ్ అయ్యాక ఒక్క సీన్ లో కూడా ఆ స్పైడర్ ను వాడలేదు…దాంతో అక్కడ నుండే ఆ సినిమా మీద ఇంపాక్ట్ పడింది…

మళ్ళీ ఇప్పుడు కల్కి లో ఇలా స్పెషల్ క్యారెక్టర్ ను వాడుతుండటంతో అందరికీ ఇప్పుడు స్పైడర్ మూవీ గుర్తుకు రాగా…ఇక్కడ మాత్రం సినిమాలో ప్రభాస్ రోల్ తో ఈ క్యారెక్టర్ ట్రావెల్ అవుతుంది కాబట్టి చిన్నపిల్లలకి సినిమా మీద ఆసక్తి మరింత పెరిగే అవకాశం ఉంది. దాంతో లాంగ్ రన్ లో టాక్ బాగుంటే మంచి ఫుట్ ఫాల్స్ సినిమాకి సొంతం అవ్వడం ఖాయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here