Home న్యూస్ వీళ్ళు మరో హిట్ కొట్టేశారు సామి….మనం మాత్రం ఇలానే ఉన్నాం!

వీళ్ళు మరో హిట్ కొట్టేశారు సామి….మనం మాత్రం ఇలానే ఉన్నాం!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ మోస్ట్ 5 నెలలు కావాడానికి సిద్ధం అవుతూ ఉండగా టాలీవుడ్ లో మంచి లాభాలు తెచ్చిపెట్టిన సినిమాలు చాలా తక్కువే అని చెప్పాలి. రీసెంట్ టైంలో మంచి హిట్ పడి కూడా చాలానే వారాలు అవుతుంది….కోలివుడ్ లో ఎట్టకేలకు రీసెంట్ గా రిలీజ్ అయిన ఒకటి రెండు సినిమాలు మంచి కలెక్షన్స్ తో జోరు చూపిస్తున్నాయి…

ఇక బాలీవుడ్ కొన్ని మంచి హిట్స్ ను ఆల్ రెడీ సొంతం చేసుకుని ప్రస్తుతం కొంచం స్లో అయ్యాయి. కానీ మలయాళ ఇండస్ట్రీ మాత్రం వరుస పెట్టి ఈ ఇయర్ 100-150 కోట్ల సినిమాలతో దుమ్ము లేపగా ఒక ఇండస్ట్రీ హిట్ 240 కోట్ల సినిమా కూడా సొంతం చేసుకున్నారు. అయినా కూడా వరుస పెట్టి రిలీజ్ అవుతున్న నోటబుల్ మూవీస్….

మంచి రిజల్ట్ లను సొంతం చేసుకుంటూనే ఉండటం విశేషం అని చెప్పాలి. బాక్ టు బాక్ హిట్స్ తర్వాత రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు పృద్విరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ  గురువయూర్ అంబాల నడియిల్( Guruvayoorambala Nadayil Movie) సినిమా లైట్ కామెడీ ఎంటర్ టైనర్ గా రిలీజ్ అవ్వగా….

వీకెండ్ లో సూపర్ స్టడీ కలెక్షన్స్ తో వరల్డ్  వైడ్ గా జోరు చూపిస్తూ మరో హిట్ దిశగా దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి. సినిమా రిలీజ్ అయిన 3 రోజుల్లో ఆల్ మోస్ట్ 11.9 కోట్ల గ్రాస్ ను అందుకోగా రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 2.60 కోట్ల గ్రాస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా…

ఓవర్సీస్ లో ఎక్స్ లెంట్ గా జోరు చూపించిన ఈ సినిమా ఏకంగా 15.60 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 3 రోజుల్లో 30.10 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది…4వ రోజు సండే మరింత జోరు చూపిస్తున్న సినిమా ఈ రోజు కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. వరుస పెట్టి హిట్స్ తో మలయాళ ఇండస్ట్రీ జోరు చూపిస్తూ ఉండగా టాలీవుడ్ మాత్రం మళ్ళీ హిట్స్ సీజన్ స్టార్ట్ కోసం ఎదురు చూస్తుంది అని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here