Home న్యూస్ విజయ్ రికార్డ్ బ్రేక్ చేసే ఛాన్స్ సలార్ కి ఉందా….లేదా!!

విజయ్ రికార్డ్ బ్రేక్ చేసే ఛాన్స్ సలార్ కి ఉందా….లేదా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర 2023 ఇయర్ కి గాను ఇండియన్ మూవీస్ పరంగా కొన్ని సినిమాలు అంచనాలను మించి కలెక్షన్స్ పరంగా దుమ్ము లేపాయి… వాటిలో మొదటి రోజు కలెక్షన్స్ పరంగా హైయెస్ట్ గ్రాస్ ఓపెనింగ్స్ రికార్డ్ ను నమోదు చేసిన సినిమా చాలా టైం వరకు పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)…

నటించిన ఆదిపురుష్(Adipurush) సినిమా పేరిట రికార్డ్ ఉండగా తర్వాత ఆ రికార్డ్ ను కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన మోస్ట్ హైప్ మూవీ అయిన లియో(Leo Movie) బ్రేక్ చేసి కొత్త ఓపెనింగ్ డే రికార్డ్ ను నమోదు చేసింది…. మొదటి రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర…

ఏకంగా 146.15 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది…. కాగా ఈ సినిమా తర్వాత ఇండియన్ మూవీస్ పరంగా భారీ హైప్ తో వచ్చిన టైగర్3 కానీ లేటెస్ట్ యానిమల్ మూవీస్ కానీ లియోని అందుకోలేదు. ఇలాంటి టైంలో ఇయర్ లో 2 సినిమాలు మాత్రమే రేసులో నిలిచాయి.

LEO Movie 12 Days Total WW Collections!!

అవి షారుఖ్ ఖాన్ నటించిన డంకి కాగా మరోటి ప్రభాస్ సలార్ సినిమాలు, డంకి క్లాస్ మూవీ అవ్వడంతో స్లో స్టార్ట్ నే సొంతం చేసుకునే అవకాశం ఉంది, కానీ సలార్ పై మాస్ అంచనాలు మరో లెవల్ లో ఉన్నా రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ అండ్ సాంగ్ తో సినిమా మీద మరీ మాస్ ఎక్స్ పెర్టేషన్స్ ని మేకర్స్ కొద్ది వరకు తగ్గించారు.

అయినా సలార్ కి మాత్రమే లియో డే 1 రికార్డ్ ను బ్రేక్ చేసే అవకాశం ఉంది కానీ పోటిలో డంకి ఉండటం, ఓవర్సీస్ అండ్ ఇండియాలో కొద్ది వరకు ఆక్వామన్2 ఇంపాక్ట్ కూడా ఉండటంతో ఎంతవరకు కలెక్షన్స్ కి గండి పడుతుందో అనేది డౌట్ గా మారింది. వీటికి తట్టుకుని డే 1 రికార్డ్ కొడితే మట్టుకు సినిమా లాంగ్ రన్ లో ఊచకోత కోసే అవకాశం ఎంతైనా ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here