Home న్యూస్ వాషౌట్ అయిపోయిన కెప్టెన్ మిల్లర్….భారీ ఎదురుదెబ్బ ఇది!

వాషౌట్ అయిపోయిన కెప్టెన్ మిల్లర్….భారీ ఎదురుదెబ్బ ఇది!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ తెలుగు లో సార్(Sir Movie)తో సాలిడ్ హిట్ ను సొంతం చేసుకున్న కోలివుడ్ హీరో ధనుష్(Dhanush) ఆ సినిమాతో ఇక్కడ మంచి మార్కెట్ ను సొంతం చేసుకోగా తన తర్వాత సినిమా అయిన కెప్టెన్ మిల్లర్(Captain Miller Movie) తెలుగులో కూడా మంచి జోరుని చూపిస్తుందని…

అందరూ అందుకున్నారు కానీ సంక్రాంతికి భారీ పోటి వలన సినిమా తెలుగు రిలీజ్ ఆలస్యం అవ్వగా తమిళ్ లో సినిమాకి మిక్సుడ్ రెస్పాన్స్ రాగా పండగ టైంలో అక్కడ పర్వాలేదు అనిపించేలా కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నా కూడా తెలుగు లో టాక్ ఆల్ రెడీ తెలిసిపోవడంతో…

రిపబ్లిక్ డే అడ్వాంటేజ్ తో ఆ వీకెండ్ లో రిలీజ్ అయినా కూడా ఏమాత్రం ఇంపాక్ట్ ని చూపించలేక పోయిన సినిమా వీకెండ్ మొత్తం మీద 1.9 కోట్ల రేంజ్ లోనే గ్రాస్ ను వసూల్ చేయగా వర్కింగ్ డేస్ లో కంప్లీట్ గా వాషౌట్ అయిపొయింది సినిమా ఇప్పుడు….

ఓవరాల్ గా సినిమా వర్కింగ్ డేస్ లో క్రాష్ అయిపోవడంతో మొత్తం మీద ఇప్పటి వరకు 2.10 కోట్ల లోపే గ్రాస్ ను సినిమా అందుకోగా ఓవరాల్ గా షేర్ కోటి రేంజ్ లోనే ఉంటుందని అంచనా… సినిమా మొత్తం మీద 4 కోట్ల వాల్యూ టార్గెట్ తో బరిలోకి దిగినా 3 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

ధనుష్ సార్ తో వచ్చిన మార్కెట్ ను ఈ సినిమాతో అనుకున్న రేంజ్ లో నిలబెట్టుకోలేక పోయాడు అని చెప్పాలి, కానీ తర్వాత చేయబోయే సినిమా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో కింగ్ నాగార్జునతో కలిసి ఉండబోతూ ఉండటంతో ఆ సినిమాతో తిరిగి తన మార్కెట్ ను ఇక్కడ నిలబెట్టుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here