Home న్యూస్ రాయలసీమలో సలార్ వర్త్ షేర్ రికార్డ్….మాస్ జాతర….కానీ!!

రాయలసీమలో సలార్ వర్త్ షేర్ రికార్డ్….మాస్ జాతర….కానీ!!

1

పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన పాన్ ఇండియా మూవీ సలార్(Salaar Movie) వరల్డ్ వైడ్ గా సెన్సేషనల్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోగా నైజాం ఏరియాలో ఆల్ మోస్ట్ RRR movie కి నెక్ టు నెక్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా రాయలసీమ ఏరియాలో కూడా…

నాన్ RRR సినిమాల పరంగా వర్త్ షేర్ టాప్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. బాహుబలి2 6.35 కోట్ల షేర్ ని అందుకుని అప్పట్లో వర్త్ షేర్ రికార్డ్ కొట్టగా తర్వాత అరవింద సమేత 5.48 కోట్ల షేర్ తో నాన్ పాన్ ఇండియా మూవీస్ లో బిగ్ వర్త్ షేర్ డే 1 రికార్డ్ ను నమోదు చేసింది…

ఈ రికార్డ్ చాలా ఏళ్ళు ఉండగా ఇప్పుడు ఎట్టకేలకు వర్త్ షేర్ పరంగా సలార్ మూవీ మొదటి రోజు ఇక్కడ 6.45 కోట్ల వర్త్ షేర్ ని సొంతం చేసుకుని బిగ్ రికార్డ్ ను నమోదు చేసింది. ఓవరాల్ గా ఇది మెంటల్ మాస్ కలెక్షన్స్ అయినా కూడా నైజాంలో RRR లెవల్ లో దుమ్ము దుమారం లేపిన సినిమా ఇక్కడకి వచ్చే సరికి మాత్రం…

RRR Movie 6 Days Total World Wide Collections!

ఆ సినిమా కలెక్షన్స్ తో పోటి పడలేక పోయింది. RRR మూవీ మొదటి రోజు 17 కోట్ల షేర్ ని అందుకుంటే అందులో 4.27 కోట్ల హైర్స్ ఉన్నాయి. అవి తీసేసినా కూడా 12.73 కోట్ల వర్త్ షేర్ తో సంచలనం సృష్టించగా అందులో సగం వరకు మాత్రమే ఇప్పుడు సలార్ సినిమా మొదటి రోజున సొంతం చేసుకుంది.

కొన్ని లిమిటేషన్ లు, పోటి లాంటివి ఇబ్బంది పెట్టగా ఓవరాల్ గా సాలిడ్ స్టార్ట్ నే ఇక్కడ సొంతం చేసుకుంది సినిమా. ఇక లాంగ్ రన్ లో ఇక్కడ బిజినెస్ మీద ఎలాంటి కలెక్షన్స్ తో ఈ సినిమా రచ్చ చేస్తుందో చూడాలి ఇక…

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here