Home న్యూస్ చాణక్య డే 2 కలెక్షన్స్…దిమ్మతిరిగే షాక్ ఇది!!

చాణక్య డే 2 కలెక్షన్స్…దిమ్మతిరిగే షాక్ ఇది!!

0

     లౌక్యం తర్వాత మళ్ళీ అలాంటి విజయం కోసం ఎదురు చూస్తున్న యాక్షన్ హీరో గోపీచంద్ భారీ ఆశలు పెట్టుకుని చేసిన లేటెస్ట్ మూవీ చాణక్య బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా మొదటి ఆటకే యావరేజ్ టాక్ ని తెచ్చుకుంది, కానీ పోటి లో సైరా ఉండటం తో ఈ సినిమా కి మొదటి రోజే షాకింగ్ అనిపించే లెవల్ లో కేవలం 1.1 కోట్ల షేర్ ని మాత్రమె అందుకో గలిగింది.

ఇక సినిమా రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపుతుంది డబుల్ గ్రోత్ ని సాధించాల్సిన అవసరం తో బరిలొకి దిగిన చాణక్య రెండో రోజు ఆదివారం అయినా కానీ పెద్దగా అడ్వాంటేజ్ ను సొంతం చేసుకోలేక పోయింది, రెండు తెలుగు రాష్ట్రాలలో రెండో రోజు డ్రాప్స్ గట్టిగానే ఉన్నాయు.

ముఖ్యంగా రెండో రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు తో పోల్చితే 30% వరకు డ్రాప్స్ కనిపించగా ఈవినింగ్ అండ్ నైట్ షోలలో కొద్ది వరకు గ్రోత్ ని సాధించినా అది సినిమా బిజినెస్ ని అయితే రికవరీ చేసే రేంజ్ లో అయితే కనిపించ లేదు అనే చెప్పాలి.

మొత్తం మీద రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మొత్తం మీద 70 లక్షల రేంజ్ లో వసూల్ చేసే అవకాశం ఉంది, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ భారీ గ్రోత్ ఉంటె ఈ లెక్క 80 లక్షల రేంజ్ కి వెళ్ళే అవకాశం ఉంది కానీ ఆ మార్క్ ని అందుకునే అవకాశం అయితే పెద్దగా కనిపించడం లేదు.

మొత్తం మీద రెండో రోజు కలెక్షన్స్ నిరాశ నే మిగిలించేలా ఉండగా సినిమా దసరా సెలవుల్లో ఇప్పుడు డబుల్ ట్రిబుల్ గ్రోత్ ని సాధిస్తేనే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంటుంది లేకపోతె గోపీచంద్ ఖాతాలో మరో ఫ్లాఫ్ మూవీ గా చాణక్య సినిమా నిలిచి పోతుంది అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here