Home న్యూస్ చంద్రముఖి2 రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

చంద్రముఖి2 రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

0

2005 టైంలో ఆడియన్స్ ను ఓ రేంజ్ లో ఆకట్టుకున్న హర్రర్ కామెడీ మూవీ చంద్రముఖి(Chandramukhi) సినిమా ఏ రేంజ్ లో సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. హర్రర్ టచ్ తో కామెడీని జోడించి మంచి థ్రిల్లింగ్ ఫీలింగ్ ను కలిగించిన ఈ జానర్ తర్వాత చాలా పాపులర్ అయ్యి…. ఆ డోస్ మరీ ఓవర్ అయిపోగా ఈ జానర్ కంప్లీట్ గా ఫేడ్ ఔట్ అవ్వగా…

ఈ సినిమాకి సీక్వెల్ గా ఇప్పుడు రాఘవ లారెన్స్(Raghava Lawrence) కంగనా రనౌత్(Kangana Ranaut) ల కాంబినేషన్ లో వచ్చిన చంద్రముఖి2 సినిమా(Chandramukhi2) సినిమా రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా ఎలా ఉంది ఎంతవరకు అంచనాలను అందుకుందో తెలుసుకుందాం పదండీ…

ఫ్యామిలీలో వచ్చిన ప్రాబ్లమ్స్ కి ఓ గుడికి వెళ్లి అక్కడ పూజలు చేసుకోవాల్సిన అవసరం ఉన్న ఒక ఫ్యామిలీ చంద్రముఖి ఇంటి దగ్గరకు వస్తారు. ఆ ఇల్లు గురించి వాళ్ళకి తెలియదు. అలాంటి టైంలో ఆ ఫ్యామిలీ ఫేస్ చేసిన పరిస్థితులు ఏంటి… చంద్రముఖి ఎందుకని తిరిగి వచ్చింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…

చంద్రముఖి2 సినిమా స్టోరీ మొదలు అవ్వడం చాలా నెమ్మదిగా చాలా ప్రిడిక్టబుల్ గా సాగుతూ ఒక దశలో బోర్ కూడా కొడుతూ కథ సాగుతూ ఉండగా ఇంటర్వెల్ ఎపిసోడ్ ఆకట్టుకోగా సెకెండ్ ఆఫ్ లో అసలు కథ మొదలు అవుతుంది. చంద్రముఖి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ బాగుండగా….

క్లైమాక్స్ పోర్షన్ చాలా బెటర్ గా అనిపించగా మిగిలిన సీన్స్ లో చంద్రముఖి ఆత్మ వచ్చే టైం లో సన్నివేశం బాగా మెప్పిస్తుంది..కానీ సినిమా పరంగా చూసుకుంటే చాలా వరకు స్క్రీన్ ప్లే పరమ రొటీన్ గా ఉండగా సంగీతం కూడా జస్ట్ యావరేజ్ గా కొన్ని చోట్ల బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం మెప్పించగా…

స్క్రీన్ ప్లే చాలా వీక్ గా ఉండగా హైలెట్ అవ్వాల్సిన హర్రర్ ఎలిమెంట్స్ అండ్ కామెడీ సీన్స్ జనాలు ఈ జానర్ కి ఆల్ రెడీ అలవాటు పడి ఉండటంతో ఏమాత్రం మెప్పించలేక పోయాయి. మొత్తం మీద లెంత్ కూడా ఎక్కువగా ఉన్నట్లు అనిపించగా….

ఓవరాల్ గా చాలా లో అంచనాలతో థియేటర్స్ కి వెళితే కొన్ని సీన్స్ వరకు సినిమా మెప్పించే అవకాశం ఉన్నా కూడా ఓవరాల్ గా సినిమా పరంగా మాత్రం చాలా అప్ అండ్ డౌన్స్ అండ్ వీక్ స్క్రీన్ ప్లే వలన సినిమా చాలా ఓపికతో చూస్తె ఒకసారి చూడొచ్చు అనిపించవచ్చు…

అంతకుమించి సినిమా నుండి ఎక్కువగా ఊహించి వెళితే మట్టుకు సినిమా నిరాశ పరిచే అవకాశం ఉంది. ఒరిజినల్ చంద్రముఖి తో పోల్చితే చంద్రముఖి2 అంచనాలను పూర్తిగా అందుకోలేదు… ఉన్నంతలో చాలా రొటీన్ గా ఉన్నా ఒకసారి ఓపికతో చూస్తె పర్వాలేదు అనిపించవచ్చు. మొత్తం మీద సినిమా కి మా రేటింగ్ 2.5 స్టార్స్….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here