Home న్యూస్ స్కంద మూవీ రివ్యూ ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

స్కంద మూవీ రివ్యూ ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

0

ఉస్తాద్ రామ్ పోతినేని(Ram Pothineni) బోయపాటి శ్రీను(Boyapati Sreenu) ల కాంబినేషన్ లో ఆడియన్స్ ముందుకు భారీ అంచనాల నడుమ వచ్చిన లేటెస్ట్ మూవీ స్కంద(Skanda) వరల్డ్ వైడ్ గా భారీ లెవల్ లో రిలీజ్ అవ్వగా సినిమా మీద ఆడియన్స్ లో అంచనాలు పర్వాలేదు…

అనిపించేలా ఉండగా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది ఎంతవరకు అంచనాలను అందుకుందో తెలుసుకుందాం పదండీ… ముందుగా స్టోరీ పాయింట్ విషయానికి వస్తే…రెండు రాష్ట్రాల సిఎమ్ ల ఫ్యామిలీస్ మధ్యలో వచ్చిన ఒక క్లాష్ కి హీరో కి ఉన్న లింక్ ఏంటి…

హీరో ఎలా తను అనుకున్నది సాధించాడు అన్నది మొత్తం మీద స్కంద సినిమా స్టోరీ… రొటీన్ కమర్షియల్ మూవీ లో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ముందే ప్రిపేర్ అయ్యి వెళితే….బోయపాటి మాస్ ఎలివేషన్స్ ను అలాగే కొన్ని గూస్ బంప్స్ తెప్పించే ఫైట్ సీన్స్ ను…

ఎంజాయ్ చేయోచ్చు… కొత్తతనం కావాలి కథ అద్బుతంగా ఉండాలి లాంటి ఆశలు అంచనాలు ఉంటే మాత్రం సినిమా కొంచం రొటీన్ మూవీగా ఎక్కువగా అనిపించడం ఖాయమని చెప్పొచ్చు. ఓవరాల్ గా సినిమా లో రామ్ తన ఎక్స్ లెంట్ స్క్రీన్ ప్రజెన్స్ అండ్ హీరోయిజం తో బాగా మెప్పించాడు…

క్లైమాక్స్ పోర్షన్ ఒకింత అందరినీ ఎక్సైట్ చెయ్యడమే కాదు పార్ట్ 2 కోసం ఎదురు చూసేలా చేస్తుంది.. ఇక శ్రీలీల పర్వాలేదు అనిపించగా క్యారెక్టర్ రోల్స్ చాలా మంది చేయగా అందరూ తమ తమ రోల్స్ లో ఆకట్టుకున్న అక్కడక్కడా కొంచం ఓవర్ యాక్షన్ ఎక్కువ అయినట్లు అనిపిస్తుంది…

సంగీతం వీక్ గా ఉండగా బ్యాగ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల బాగున్నా ఎక్కువ చోట్ల మాత్రం మరీ లౌడ్ గా అనిపించింది అని చెప్పాలి. అయినా కానీ కొన్ని ఎలివేషన్ సీన్స్ కి తమన్ అద్బుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్ అందించాడు. ఇక ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే పరమ రొటీన్ గా ఉండగా….

సినిమాటోగ్రఫీ మాత్రం బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్ గా ఉండగా బోయపాటి శ్రీను ఎంచుకున్న పాయింట్స్ ఈ మధ్య చాలా రొటీన్ గా ఉంటూ వస్తుండగా స్కంద కూడా అలానే ఉన్నప్పటికీ సినిమాలో కొన్ని ఎలిమెంట్స్ మాస్ ఆడియన్స్ కి ఎక్కువగా రీచ్ అయ్యేలా తెరకెక్కించాడు…

మాస్ ఆడియన్స్ ను మెప్పించే క్రమంలో సినిమా బాగానే ఉందని చెప్పాలి, అదే టైంలో డిఫెరెంట్ మూవీస్ కొత్త కథలు కోరుకునే ఆడియన్స్ కి మాత్రం సినిమా ఓపికతో చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయినా కూడా అక్కడక్కడా యాక్షన్ డోస్, ఓవర్ లౌడ్ బ్యాగ్రౌండ్ స్కోర్ కొంచం ఇబ్బంది పెట్టొచ్చు…

మొత్తం మీద మీరు మాస్ మూవీస్ ని ఇష్టపడితే సినిమా లో కొన్ని అప్ డౌన్ ఉన్నప్పటికీ ఓవరాల్ గా సాటిస్ ఫై గానే ముగుస్తుంది. ఇతర సెక్షన్ ఆడియన్స్ కి కొంచం ఓపిక ఎక్కువ అవసరం… లెంత్ కొంచం తగ్గించి స్క్రీన్ ప్లే మరింత టైట్ గా పెట్టుకుని ఉంటే ఇంకా బెటర్ గా ఉండేది సినిమా…

బోయపాటి సినిమా అంటే ఆడియన్స్ కి ఆల్ రెడీ ఒక అంచనా ఉంటుంది, సినిమాలో వాళ్ళకి కావాల్సిన అంశాలు ఉంటాయి. స్కంద సినిమా అలాంటి ఆడియన్స్ కోసమే… సింగిల్ స్క్రీన్స్ లో మాస్ ఆడియన్స్ ను ఎక్కువగా సాటిస్ ఫై చేసే అవకాశం ఉంటుంది ఈ సినిమా… ఓవరాల్ గా సినిమా కి మా రేటింగ్ 2.5 స్టార్స్…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here