Home న్యూస్ బాలీవుడ్ లో రికార్డుల విరుచుకుపడిన ఛావా…వీకెండ్ లో రికార్డుల జాతర!!

బాలీవుడ్ లో రికార్డుల విరుచుకుపడిన ఛావా…వీకెండ్ లో రికార్డుల జాతర!!

0

బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ వన్ ఆఫ్ ది మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఒకటిగా నిలిచిన విక్కీ కౌశల్ రష్మిక మందన నటించిన ఛావా(Chhaava Movie) భారీ అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా..బాలీవుడ్ లో రూపొందిన హిస్టారికల్ మూవీస్ లో ఆల్ టైం బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తో…

కలెక్షన్స్ భీభత్సం సృష్టిస్తూ దూసుకు పోతూ ఉండటం విశేషం…సినిమా మహారాష్ట్ర ఏరియాలో రికార్డ్ లెవల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ మిగిలిన ఏరియాల కలెక్షన్స్ ని ఓ రేంజ్ లో డామినేట్ చేస్తుంది. ఓవరాల్ గా ఇండియా లో సినిమా మొదటి రోజున 33 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకోగా..

రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపి 39 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఇక మూడో రోజు సండే అడ్వాంటేజ్ తో అన్ని చోట్లా రెట్టించిన జోరు చూపించిన సినిమా 49 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఊహకందని ఊచకోత కోస్తూ… హీరో విక్కీ కౌశల్ కెరీర్ లో..

ఆల్ టైం రికార్డులను నమోదు చేస్తూ దూసుకు పోతూ ఉండగా, బాలీవుడ్ లో హిస్టారికల్ జానర్ మూవీస్ లో ఎపిక్ కలెక్షన్స్ తో కొత్త రికార్డులను నమోదు చేయబోతుంది. ఓవరాల్ గా వీకెండ్ లో సినిమా హిందీ లో 121 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోసింది..

ఇక్కడ మరో సెన్సేషన్ ఏంటి అంటే…ఒక్క మహారాష్ట్ర రీజన్ లోనే సినిమా ఆల్ టైం రికార్డ్ హిందీ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ వీకెండ్ లోనే 57 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని దాటేసి భీభత్సం సృష్టించింది. సినిమా లాంగ్ రన్ లో ఓవరాల్ గా 450-500 కోట్ల…

నెట్ కలెక్షన్స్ మార్క్ ని టార్గెట్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. ఇక వర్కింగ్ డేస్ లో కనుక సినిమా అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ తో హోల్డ్ కనుక చేస్తే ఈ మార్క్ ని అందుకోవడం పెద్ద కష్టమేమి కాదని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here