Home టోటల్ కలెక్షన్స్ చినబాబు టోటల్ కలెక్షన్స్…ఫ్లాఫ్

చినబాబు టోటల్ కలెక్షన్స్…ఫ్లాఫ్

0

కార్తీ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ చినబాబు రీసెంట్ గా తమిళ్ తో పాటు తెలుగు లో కూడా ఏక కాలంలో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. తెలుగు లో యావరేజ్ రివ్యూలనే సొంతం చేసుకున్నా కానీ తమిళ్ లో ఈ సినిమాకి అద్బుతమైన పాజిటివ్ టాక్ లభించింది.

తమిళ్ లో రిలీజ్ అయిన 30 రోజులకు కూడా మంచి ఆక్యుపెన్సీతో రన్ అవుతున్న ఈ సినిమా తెలుగు లో టోటల్ రన్ ని ముగించుకుంది. సినిమాను మొత్తం మీద తెలుగు లో 6.5 కోట్ల రేంజ్ లో అమ్మినట్లు సమాచారం. కాగా మొదటి వారంలో సినిమా…..

3.4 కోట్ల షేర్ ని సాధించగా మిగిలిన రన్ లో టోటల్ గా సినిమా మరో 1.4 కోట్ల షేర్ ని మాత్రమె సాధించగలిగింది. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ రన్ లో చినబాబు సినిమా 4.8 కోట్ల షేర్ ని సాధించగా ప్రీ రిలీజ్ బిజినెస్ కి 1.7 కోట్ల నష్టాలను ముగించి ఫ్లాఫ్ గా మిగిలిపోయింది. తమిళ్ తో కలిపి టోటల్ వరల్డ్ వైడ్ గా మాత్రం 32 కోట్ల షేర్ ని సాధించింది ఈ సినిమా. టోటల్ రన్ లో 35 కోట్ల రేంజ్ షేర్ తో కార్తీ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలవనుంది ఈ సినిమా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here