టాలీవుడ్ ఈ ఇయర్ కొన్ని బిగ్గెస్ట్ ఫ్లాఫ్ మూవీస్ వచ్చిన విషయం తెలిసిందే, ఆ సినిమాల్లో అసలు ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఫ్లాఫ్ అయిన సినిమాల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో అపజయం అంటే తెలియని డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో వచ్చిన ఆచార్య సినిమా ముందు నిలుస్తుంది.. భారీ అంచనాలతో సమ్మర్ బరిలో నిలిచిన ఈ సినిమా…
టాలీవుడ్ చరిత్ర లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్లాఫ్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది, అలాంటి డిసాస్టర్ రిజల్ట్ ఎఫెక్ట్ మెగాస్టార్ లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్ పై కూడా పడగా రీసెంట్ గా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియా తో మాట్లాడుతూ….
ఈ సినిమా లాస్ లు అన్నీ భర్తీ చేశారా అన్నట్లు వచ్చిన ప్రశ్నకి మెగాస్టార్ నేను అలాగే రామ్ చరణ్ ఈ సినిమా కోసం తీసుకున్న రెమ్యునరేషన్ లో 80% వరకు తిరిగి ఇచ్చేశామంటూ సినిమాకి ఇలాంటి రిజల్ట్ ఊహించక పోయినా ఇలాంటి రిజల్ట్ రావడంతో తమ వంతుగా మేం హెల్ప్ చేశామంటూ చెప్పారట.
ఈ సినిమా లాస్ విషయంలో ఇంతకుముందు హీరోలు ఎవ్వరూ అమౌంట్ వెనక్కి ఇవ్వలేదు అంటూ కామెంట్స్ రాగా, అసలు హీరోలు రెమ్యునరేషన్ తీసుకోలేదు అంటూ కూడా కామెంట్స్ వినిపించాయి, వాటన్నింటికీ చెక్ పెడుతూ ఇప్పుడు మెగాస్టార్ సినిమా లాస్ పై క్లియర్ కామెంట్స్ తో వాళ్లకి షాకిచ్చారు…